కుట్రకోణాన్ని వెలికి తీయాలి

మాజీ ఎంపీ అవినాష్‌రెడ్డి

వైయస్‌ఆర్‌ జిల్లా: మాజీ మంత్రి వైయస్‌ వివేకానందరెడ్డి మృతిపై అనుమానాలు ఉన్నాయని, అందులోని కుట్ర కోణాన్ని వెలికి తీయాలని మాజీ ఎంపీ వైయస్‌ అవినాష్‌రెడ్డి డిమాండు చేశారు. శుక్రవారం పులివెందులలో ఆయన మీడియాతో మాట్లాడారు. 
వైయస్‌ వివేకానందరెడ్డి అకాల మరణం మమ్మల్ని తీవ్రమైన కలతకు గురి చేసిందని వైయస్‌ అవినాష్‌రెడ్డి అన్నారు. ఆయన మరణంపై తీవ్ర అనుమానాలు ఉన్నాయని,  ఆయన తలపై పెద్ద గాయాలు ఉన్నాయని చెప్పారు. తలకు ముందు, వెనుక, వేళ్లకు , ముహానికి గాయాలు ఉన్నాయన్నారు. మాకున్న అనుమానాలు నివృత్తి కావాలని, ప్రభుత్వం ఈ ఘటనపై విచారణ చేపట్టాలని, ఇందులోని కుట్రను బయటకు తీయాలని, దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండు చేశారు. ఇది అనుమానాస్పద మరణమే అని పేర్కొన్నారు. నిష్పాక్షింగా విచారణచేపట్టి దోషులను కఠినంగా శిక్షించాలన్నారు. నిన్న మైదుకూరు మండలంలో కూడా ఎన్నికల ప్రచారం నిర్వహించారన్నారు. ఆరోగ్య కారణాలు ఏమాత్రం కావని, ఇందులో కుట్ర కోణం ఉందన్నారు. 
 

Back to Top