పులివెందుల: వివేకా హత్య కేసు విచారణలో సీబీఐ కీలక విషయాలు వదిలేసిందని ఎంపీ వైయస్ అవినాష్ రెడ్డి పేర్కొన్నారు. పులివెందులలో భాస్కర్‌రెడ్డిని సీబీఐ అరెస్ట్ చేయడంపై ఎంపీ వైయస్ అవినాష్ రెడ్డి స్పందించారు. ‘భాస్కర్‌రెడ్డిని ఊహించని విధంగా అరెస్ట్ చేయించారు. ధైర్యం కోల్పోకుండా నిజాయితీని నిరూపించుకుంటాం. మేం చెప్పిన అంశాలను సీబీఐ పరిశీలించలేదు. లెటర్ దాచిపెట్టామని వివేకా అల్లుడు రాజశేఖర్ రెడ్డి చెప్పారు. హత్య విషయం నా కంటే గంట ముందు వివేకా అల్లుడికి తెలుసు. కీలక అంశాలను సీబీఐ విస్మరిస్తోంది. వివేకా హత్య విషయాన్ని ముందుగా పోలీసులకు చెప్పింది నేనే. పోలీసులకు సమాచారం ఇచ్చిన నన్నే దోషిగా చూపిస్తున్నారు. నేను గాలి మాటలు.. గాలి కబుర్లు చెప్పడం లేదు. సాక్షులు చెప్పిన స్టేట్మెంట్ల ఆధారంగానే చెబుతున్నాను. సీబీఐ నమ్ముకున్న దస్తగిరి స్టేట్మెంట్లోనే అనేక కీలక అంశాలున్నాయి. వ్యక్తులను లక్ష్యంగా చేసుకుని సీబీఐ దర్యాప్తు చేస్తోంది. డాక్యుమెంట్లు చోరి కాబడ్డ ఏ4పై ఎందుకు కేసు నమోదు కాలేదు. ఏ4కి ఎందుకు ఇంత రిలీఫ్ ఇస్తున్నారు. కలిసికట్టుగా ఎవరిపైనో నెట్టే ప్రయత్నం చేస్తున్నారు. అప్రూవర్‌గా మార్చేందుకు యాంటిసిపేటరీ బెయిల్ వేయించారు. అప్రూవర్‌కు సహకరించి సీబీఐ బెయిల్ ఇప్పించింది. వాస్తవాల ఆధారంగా దర్యాప్తు చేయాలని సీబీఐని కోరుతున్నాను. ఏప్రిల్ 3న మా అభ్యంతరాలను సీబీఐ దృష్టికి తీసుకెళ్లామని అవినాష్‌రెడ్డి తెలిపారు.