యాసిడ్ దాడి బాధితుల్ని ప‌రామ‌ర్శించిన వాసిరెడ్డి ప‌ద్మ‌

రాష్ట్ర ప్ర‌భుత్వం అండ‌గా ఉంటుంద‌ని మ‌హిళా క‌మిష‌న్ చైర్‌ప‌ర్స‌న్ భ‌రోసా

విజ‌య‌వాడ‌: నందిగామ యాసిడ్ దాడి ఘ‌ట‌న‌లో గాయ‌ప‌డిన బాధితుల‌ను రాష్ట్ర మ‌హిళా క‌మిష‌న్ చైర్ ప‌ర్స‌న్ వాసిరెడ్డి ప‌ద్మ ప‌రామ‌ర్శించి, వారి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. బాధితుల‌కు రాష్ట్ర ప్ర‌భుత్వం అండ‌గా ఉంటుంద‌ని భ‌రోసా క‌ల్పించారు. బాధితుల‌కు మెరుగైన వైద్య సేవ‌లు అందించాల‌ని వైద్యుల‌కు సూచించారు. యాసిడ్ దాడి ఘ‌ట‌న‌లో గాయ‌ప‌డిన వారి ఆరోగ్య ప‌రిస్థితి నిల‌క‌డ‌గా ఉంద‌ని, నిందితుడిని పోలీసులు అరెస్టు చేశార‌ని చెప్పారు. నిందితుడికి క‌ఠిన శిక్ష ప‌డేలా చ‌ర్య‌లు తీసుకుంటామ‌న్నారు. అప‌రిచిత ప‌రిచ‌యాల‌తో మ‌హిళ‌లు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని సూచించారు. ప్రమాదం సంభవిస్తుందన్నప్పుడు దిశా యాప్ ద్వారా రక్షణ పొందేటటువంటి అవకాశం ఉందని అందరూ గుర్తించాల‌న్నారు. నేరాలు తగ్గట్లుగానే శిక్షపడేలా దిశ పనిచేస్తుందని, మహిళలు అత్యవసర పరిస్థితుల్లో దిశ యాప్ ను వినియోగించాలని మ‌హిళా క‌మిష‌న్ చైర్ ప‌ర్స‌న్ వాసిరెడ్డి ప‌ద్మ సూచించారు. 

Back to Top