చీమకుర్తిలో సీఎం వైయస్‌ జగన్‌కు ఘనస్వాగతం

ప్రకాశం: ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకాశంజిల్లా చీమకుర్తికి చేరుకున్నారు. సీఎం వైయస్‌ జగన్‌కు మంత్రులు ఆదిమూలపు సురేష్, మేరుగ నాగార్జున ,మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసులురెడ్డి, ఎమ్మెల్యే సుధాక‌ర్‌బాబు, జెడ్పీ చైర్‌పర్సన్‌ బూచేపల్లి వెంకాయమ్మ, మాజీ శాసనసభ్యులు బూచేపల్లి శివప్రసాదరెడ్డి ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా చీమకుర్తి నగర పంచాయతీ సభ్యులను సీఎం వైయస్‌ జగన్‌ పరిచయం చేసుకున్నారు. అనంతరం వారితో కలిసి ఫొటో దిగారు. మరికొద్దిసేపట్లో బూచేపల్లి కల్యాణ మండలం వద్ద దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి, దర్శి మాజీ శాసనసభ్యులు సుబ్బారెడ్డి కాంస్య విగ్రహాలను సీఎం వైయస్‌ జగన్‌ ఆవిష్కరించనున్నారు. అనంతరం బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. 
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top