విజయనగరం: జిల్లాలోని ఓ ఆస్పత్రిలో ఆక్సిజన్ సరఫరాలో తలెత్తిన సాంకేతిక సమస్యను పరిష్కరిస్తున్నామని డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి తెలిపారు. వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని పరిస్థితిని సమీక్షిస్తున్నారని చెప్పారు. ఆక్సిజన్ సరఫరాలో సాంకేతిక సమస్యపై డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి స్పందించారు. ఆస్పత్రి సిబ్బంది సకాలంలో స్పందించి ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టారని తెలిపారు. 15 మంది రోగులను వెంటనే వేరే ఆస్పత్రికి తరలించారన్నారు. బాధితులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఈ ఘటనపై జిల్లా కలెక్టర్ హరిజవహర్‌లాల్ కూడా స్పందించారు. సాంకేతిక సమస్యను పరిష్కరిస్తున్నామని చెప్పారు. ఆక్సిజన్ అందక ఎవరూ చనిపోలేదని వైద్యులు చెప్పారని ఆయన పేర్కొన్నారు.