దెందులూరులో సీఎం వైయస్‌ జగన్‌కు ఘనస్వాగతం 

ఏలూరు: ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఏలూరు జిల్లా దెందులూరు చేరుకున్నారు. హెలిప్యాడ్‌ వద్ద సీఎం వైయస్‌ జగన్‌కు స్థానిక ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి, మంత్రులు కొట్టు సత్యనారాయణ, కారుమూరి నాగేశ్వరరావు, మాజీ మంత్రి ఆళ్ల నాని, రాజ్య‌స‌భ స‌భ్యులు పిల్లి సుభాష్ చంద్ర‌బోస్‌, లోక్‌స‌భ స‌భ్యులు కోట‌గిరి శ్రీ‌ధ‌ర్‌, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ ముఖ్య నేతలు, అధికారులు ఘనస్వాగతం పలికారు. మరికాసేపట్లోనే సీఎం వైయస్‌ జగన్‌ దెందులూరులో వైయస్‌ఆర్‌ ఆసరా సభా ప్రాంగణానికి చేరుకోనున్నారు. బహిరంగ సభలో అక్కచెల్లెమ్మలను ఉద్దేశించి ప్రసంగించిన అనంతరం వరుసగా మూడో ఏడాది వైయస్‌ఆర్‌ ఆసరా పథకానికి సంబంధించి రూ.6,419.89 కోట్ల నిధులను సీఎం వైయస్‌ జగన్‌ విడుదల చేయనున్నారు. 

Back to Top