ఓటమి భయంతో టీడీపీ అక్రమార్గం..

యథేచ్ఛగా కోడ్‌ ఉల్లంఘన

కర్నూలు జిల్లాలో సైకిళ్ల పంపిణీ

కర్నూలు: అధికార టీడీపీ మళ్లీ అధికారం దక్కించుకోవడానికి దిగజారుడు చర్యలకు పాల్పడుతోంది. యథేచ్ఛగా ఎన్నికల కోడ్‌ ఉల్లంఘనకు పాల్పడుతోంది. కోడ్‌కు విరుద్ధంగా కర్నూలు జిల్లాలోని అన్ని మండలాల్లో విద్యార్థులకు సైకిళ్లను పంపిణీ   చేస్తున్నారు. టీడీపీ నేతలు  సైకిళ్లు పంపిణీ చేస్తున్నా ఎన్నికల అధికారులు పట్టించుకోవడంలేదనే ఆరోపణలు వస్తున్నాయి. ఓటర్లను ప్రభావితం చేయడానికి టీడీపీ నేతలు అడ్డగోలుగా సైకిళ్లను పంపిణీ చేస్తున్నారని వైయస్‌ఆర్‌సీపీ నేతలు మండిపడుతున్నారు. టీడీపీ  ఓటమి భయంతో ఓట్ల తొలగింపు నుంచి అనేక అక్రమాలకు పాల్పడుతుందని విమర్శించారు

 

Back to Top