విశాఖ టీడీపీ కార్పొరేట‌ర్ వైయ‌స్ఆర్‌సీపీలో చేరిక‌

తాడేప‌ల్లి:  అధికార తెలుగు దేశం పార్టీకి విశాఖ‌లో భారీ షాక్ త‌గిలింది. ఆ పార్టీకి చెందిన విశాఖ‌ 41 వ వార్డు  కార్పొరేటర్‌ కోడిగుడ్ల పూర్ణిమ శ్రీధర్ వైయ‌స్ఆర్‌సీపీలో చేరారు. మంగ‌ళ‌వారం తాడేప‌ల్లిలోని వైయ‌స్ఆర్‌సీపీ కేంద్ర కార్యాల‌యంలో పార్టీ అధినేత వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి స‌మ‌క్షంలో కోడిగుడ్ల పూర్ణిమ శ్రీధర్ వైయ‌స్ఆర్‌సీపీలో చేరారు.   కార్యక్రమంలో వైయ‌స్ఆర్‌సీపీ ఉత్తరాంధ్ర రీజనల్ కో-ఆర్డినేటర్‌ కురసాల కన్నబాబు, విశాఖ జిల్లా అధ్యక్షుడు కే కే రాజు, విశాఖ సౌత్‌ ఇంఛార్జ్‌ వాసుపల్లి గణేష్ పాల్గొన్నారు.

Back to Top