సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా ‘జగనన్న జయభేరి’ పాట  

 
తాడేపల్లి : పంచాయతీ ఎన్నికల్లో వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ సాధించిన విజయాన్ని పురస్కరించుకొని రూపొందించిన ‘జగనన్న జయభేరి’ పాట సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. ఈ పాట‌ను రాజ్యసభ సభ్యుడు, వైయ‌స్ఆర్‌  సీపీ గుంటూరు, కృష్ణా జిల్లాల ఇన్‌చార్జి మోపిదేవి వెంకటరమణారావు  విడుదల చేశారు. మున్సిపల్, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో అఖండ విజయాన్ని ఆకాంక్షిస్తూ రచయిత, సినీ నటుడు చిట్టినేని లక్ష్మీ నారాయణ ఐదు నిమిషాల నిడివి గల ఈ పాటను రచించి, సంగీతం సమకూర్చారు. ఈ కార్యక్రమంలో రచయిత చిట్టినేని లక్ష్మీనారాయణ,  పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

https://www.youtube.com/watch?v=tJA2Ks960JM&feature=youtu.be

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top