విజయవాడ : రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల అభివృద్ధికి మద్దతుగా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆదివారం భారీ ర్యాలీ చేపట్టింది. వికేంద్రీకరణకు రాజధాని ప్రాంత ప్రజలు మద్దతు తెలుపుతూ భారీ సంఖ్యలో ప్రదర్శనలో పాల్గొన్నారు. విజయవాడ నగరంలోకి బీఆర్‌టీఎస్ రోడ్డు నుంచి మధురానగర్ వరకు పార్టీ కార్యకర్తలు, మహిళలు, ప్రజలు శాంతి ర్యాలీ నిర్వహించారు. మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్యేలు జోగి రమేష్, మల్లాది విష్ణు, పార్థసారథి, పార్టీ నేతలు యార్లగడ్డ వెంకట్‌రావు, దేవినేని అవినాశ్, గౌతం రెడ్డి ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్బగా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలని మహిళలు నినదించారు. మూడు రాజధానులను స్వాగతిస్తున్నామని చెప్పారు. చంద్రబాబు కృత్రిమ ఉద్యమం మంత్రి వెల్లంపల్లి మాట్లాడుతూ.. చంద్రబాబు మోసాలను అరికట్టేందుకే ఈ ర్యాలీ చేపట్టామని తెలిపారు. ముఖ్యమంతి వైయస్ జగన్ నిర్ణయాలను విజయవాడ ప్రజలు స్వాగతిస్తున్నారని అన్నారు. చంద్రబాబు కృత్రిమ ఉద్యమం చేస్తున్నారని ఎద్దేవా చేశారు. ప్రభుత్వానికి మద్దతు తెలిపేందుకు వేలాది మంది ప్రజలు, మహిళలు రోడ్ల మీదకు వచ్చారని పేర్కొన్నారు. ఇన్‌సైడర్ ట్రేడింగ్‌తో చంద్రబాబు అండ్ గ్యాంగ్ భూముల్ని కొట్టేశారని వెల్లంపల్లి ఆరోపించారు. . ఆయనొక అసమర్థుడు.. చంద్రబాబు రాయకీయ భిక్షగాడని ఎమ్మెల్యే జోగి రమేష్ వ్యాఖ్యానించారు. మూడు ప్రాంతాల అభివృద్ధే తమ ధ్యేయమన్నారు. ఐదేళ్ల పాలనా కాలంలో దుర్గా వారధిని కట్టని అసమర్థుడు చంద్రబాబు అని అన్నారు. బాబు ట్రాప్‌లో పడొద్దని ప్రజలకు విఙ్ఞప్తి చేశారు. అమరావతిలో బాబు చేసిందేమీ లేదని ఎద్దేవా చేశారు. విజయవాడ సమగ్రాభివృద్ధే సీఎం వైఎస్ జగన్ ధ్యేయమన్నారు. లెజిస్లేటివ్ క్యాపిటల్ విజయవాడలోనే ఉందని గుర్తు చేశారు. సుజనాచౌదరి వంటి బ్రోకర్ల మాటలు నమ్మొద్దని అన్నారు.