రఘురామకృష్ణరాజుపై అనర్హత వేటు వేయండి 

లోకసభ స్పీకర్‌కు వైయ‌స్ఆర్ సీపీ నేత విజయసాయిరెడ్డి లేఖ

 న్యూఢిల్లీ: నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజుపై అనర్హత వేటు వేయాలని దాఖలు చేసిన పిటిషన్‌పై త్వరితగతిన చర్యలు తీసుకోవాలని వైయ‌స్ఆర్ సీపీ పార్లమెంటరీ పక్ష నేత విజయసాయిరెడ్డి.. లోకసభ స్పీకర్ ఓం బిర్లాకు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన స్పీకర్‌కు లేఖ రాశారు. రఘురామకృష్ణరాజుపై అనర్హత పిటిషన్ దాఖలు చేసి 11 నెలలు గడిచిందని, అయినా ఇప్పటికీ అతనిపై ఎటువంటి చర్యలకు ఉపక్రమించకపోవడం విచారకరమని ఆయన పేర్కొన్నారు.  

పార్లమెంటరీ సంప్రదాయాలను పాటించడంలో లోక్‌సభ స్పీకర్ కార్యాలయం ఆదర్శంగా ఉండాలని, అనర్హత పిటిషన్‌పై చర్యలు తీసుకోవడంలో జరుగుతున్న విపరీతమైన జాప్యం వల్ల నర్సాపురం ప్రజలకు తీరని అన్యాయం జరుగుతుందని ఆయన వాపోయారు. అర్హత లేని వ్యక్తి పార్లమెంట్‌ సమావేశాలకు హాజరు కావడం అనైతికమని, ఈ విషయమై లోకసభ స్పీకర్ తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరారు. అనర్హత పిటిషన్‌పై మూడు నెలల్లో చర్యలు తీసుకోవాలని సుప్రీం కోర్టు తీర్పులో పేర్కొన్న విషయాన్ని ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు.  

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top