ప్రభుత్వం స్పందించిన తీరు అభినందనీయం

అమరావతి: తూర్పు గోదావరి జిల్లా దేవీపట్నం వద్ద గోదావరిలో జరిగిన బోటు ప్రమాద ఘటనపై వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలుపుతూ ఈ మేరకు ఆయన ట్వీట్‌ చేశారు. ‘గోదావరిలో దేవీపట్నం వద్ద జరిగిన పడవ ప్రమాదం అత్యంత దురదృష్టకర ఘటన. సహాయ చర్యలు చేపట్టడంలో ప్రభుత్వం స్పందించిన తీరు అభినందనీయం. బాధిత కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. ఇటువంటి ప్రమాదాలకు ఆస్కారం లేకుండా కఠిన నిబంధనలు రూపొందించి అమలు చేయాలి’అని పేర్కొన్నారు. 

 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top