వైయ‌స్ఆర్ పేరు పెడితే టీడీపీకి భ‌య‌మెందుకు

మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ
 

అమ‌రావ‌తి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైద్యరంగంలో దేశంలో అగ్రగామిగా ఉండాలని, నిపుణులైన, నిష్ణాతులైన డాక్టర్లను తయారు చేయాలని ఆయన ఆలోచన. పేదవాడి ఆరోగ్యం గురంచి ఆలోచించిన సంజీవిని లాంటి ఆరోగ్యశ్రీప్రదాత అయిన వైయస్సార్ గారి పేరును హెల్త్ యూనివర్సిటీకి ప్రతిపాదిస్తుంటే టీడీపీకి భయం వేస్తోంద‌ని మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల‌కృష్ణ అన్నారు. మీడియా పాయింట్ వ‌ద్ద బుధ‌వారం మంత్రి మాట్లాడారు. 

ఎన్టీఆర్ గారి పట్ల వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి కానీ, జగన్ మోహన్ రెడ్డిగారికి కానీ ద్వేషం లేదు. ఈ జిల్లాకే ఆయన పేరు నామకరణం చేసాం కదా.

ఎన్టీ రామారావుగారిని ఆత్మక్షోభకు గురిచేసి, పార్టీని లాక్కుని, పదవిని లాక్కుని, మరణానికి కారణమైనటువంటి, తెలుగుదేశం నాయకుడు చంద్రబాబు నాయుడు ప్రవర్తన ప్రజలకు గుర్తుంది. 
ఇటీవల ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ నుంచి వాడిపేరు తీసేస్తా అని చంద్రబాబు స్వయంగా ఏబీఎన్ రాధాకృష్ణతో అనడం వినలేదా?
ఎన్టీఆర్ పేరును చెరిపి తన పేరు తెచ్చుకోవాలనే ప్రయత్నంలో తాను చేసిన ఇంటర్వ్యూ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
మీకు మా నిర్ణయంపై అభ్యంతరం ఉంటే సభాసాంప్రదాయాలను పాటిస్తూ తెలియజేయాలి.
బాబుకు ఒక ఆందోళన ఉంది. రాష్ట్రంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి వస్తున్న ఆదరణ గమనించి తానెలాగూ ముఖ్యమంత్రి కాలేడు కనుక తన కొడుకునైనా ఏదైనా చేయాలని తెగ ప్రయత్నిస్తున్నాడు. 
సంక్షోభంలో సంక్షేమం అంటున్నాడు బాబు
చంద్రబాబు సన్ క్షోభంలో ఉన్నాడు.
ఆ సన్ కి సంక్షేమం అందించాలన్నదే బాబు ప్రయత్నంలో బాబుకి పదవి పోయింది.
అదే బాబు సంక్షోభం.
టీడీపీ ఇంకా సంక్షోభంలోకి వెళ్తుంది. 
ఈ రాష్ట్ర ప్రజలు తమకు జరిగే మంచిని నిశితంగా పరిశీలిస్తూ, మంచి చేసే వ్యక్తులను ప్రోత్సహిస్తూ, మంచిచేసే నాయకుడి పట్ల అంకితభావంతో ఉంటారు. 
సీఎం వైయస్ జగన్ ప్రజల కష్టాలను తీరుస్తూ, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీల ఆత్మగౌరవ రక్షకుడిగా ఉంటే దీన్నుంచి ప్రజల దృష్టి మరల్చాలని టీడీపీ చేసే ప్రయత్నాన్ని ప్రజలు గమనించాలి.

Back to Top