రాష్ట్రంలో చిచ్చుపెట్టేందుకు బీజేపీ కుట్ర

 మంత్రి వెలంపల్లి 
 

గుంటూరు:  రాష్ట్రంలో బీజేపీ చిచ్చుపెట్టేందుకు కుట్ర చేస్తుంద‌ని మంత్రి వెల్లంప‌ల్లి శ్రీ‌నివాస్ మండిప‌డ్డారు.  జిన్నా టవర్‌పై రాద్ధాంతం బీజేపీ కుట్రే. ప్రశాంతంగా ఉన్న రాష్ట్రంలో మత విద్వేషాలు సృష్టించాలని బీజేపీ ప్రయత్నిస్తోంద‌అని అన్నారు.  రాష్ట్రంలో 2014 – 19 మధ్య టీడీపీతో కలిసి అధికారాన్ని అనుభవించిన బీజేపీకి గుంటూరులో జిన్నా టవర్‌ ఉందని గుర్తు రాలేదా? 100 ఏళ్ల క్రితం నిర్మించిన టవర్‌ గురించి ఇప్పుడు గొడవ పెడుతున్నారంటే ఇంతకంటే దిగజారుడుతనం ఉంటుందా? కేంద్ర మంత్రులు పదే పదే రాష్ట్రానికి వచ్చి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం సరైన పద్ధతేనా? ఏ ప్రభుత్వమైనా ఒక వర్గం పట్ల ఒకలా, మరో వర్గం పట్ల ఇంకోలా వ్యవహరిస్తుందా? వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం ప్రజలను కన్నబిడ్డలుగా చూసుకుంటోంది. మా ప్రభుత్వం ఏవర్గానికి వ్యతిరేకం కాదు. శాంతిభద్రతల పరిరక్షణలో రాజీ పడబోము. అలజడులు సృష్టించేవారిపై కఠిన చర్యలు చేపడతామ‌ని వెలంపల్లి చెప్పారు.  

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top