మహిళా రక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉంది

రాష్ట్ర మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ వాసిరెడ్డి పద్మ
 

విజయవాడ: ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం మహిళా రక్షణకు కట్టుబడి ఉందని రాష్ట్ర మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ వాసిరెడ్డి పద్మ అన్నారు.  హస్కీక్యాపర్స్‌ ఆధ్వర్యంలో విజయవాడలోని ఓ ఫంక్షన్‌ హాల్‌లో విద్యార్థినులకు కరాటేలో శిక్షణ, సెల్ఫ్‌డిఫెన్స్‌పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన వాసిరెడ్డి పద్మ మాట్లాడుతూ.. అమ్మాయిలు బుల్లెట్‌పై రైడ్‌ చేస్తూ మీమంతా స్ట్రాంగ్‌గా ఉన్నామనే మెసేజ్‌ను సమాజానికి ఇస్తున్నారని, ఇందుకు కారణమైన హస్కీక్యాపర్స్‌ స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు కాశ్చాయని, సత్య, చిన్నపరెడ్డిలను ఆమె అభినందించారు. బాలికల స్థాయి నుంచే ఆత్మరక్షణ కోసం మార్షల్‌ ఆర్ట్స్‌ నేర్చుకోవాలని విద్యార్థినులకు సూచించారు.

రాబోయే అసెంబ్లీ సమావేశాల్లోనే మహిళా రక్షణకు కఠిన చట్టాన్ని తీసుకురావడానికి సీఎం వైయస్‌ జగన్‌ ప్రయత్నం చేస్తున్నారన్నారు. సీఎం వైయస్‌ జగన్‌ ప్రభుత్వం మహిళలకు అనుకూలంగా ఉన్న ప్రభుత్వమన్నారు. మహిళలకు డిప్యూటీ సీఎం పదవి, కేబినెట్‌లో మహిళలకు చోటు, హోంమంత్రిగా మహిళలను నియమించడం జరిగిందని, అంతేకాకుండా ఆడవారి పేరు మీదనే ఇళ్లపట్టాలు ఇవ్వడం, డ్వాక్రా మహిళలకు సున్నావడ్డీ, 50 శాతం రిజర్వేషన్, మద్యపాన నిషేధం, అమ్మఒడి పథకం వంటి పథకాలను అమలు చేస్తున్నారన్నారు.

Read Also:ఆడపిల్లల ఆత్మరక్షణకు కరాటే అవసరం

 

తాజా వీడియోలు

Back to Top