15న మాచర్లకు సీఎం వైయ‌స్‌ జగన్‌

వరికపూడిసెల ప్రాజెక్టు శంకుస్ధాపన.. 
 

తాడేప‌ల్లి: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం(నవంబర్‌ 15న) పల్నాడు జిల్లా మాచర్లకు వెళ్లనున్నారు. వరికపూడిసెల ప్రాజెక్టుకు ముఖ్య‌మంత్రి శంకుస్ధాపన చేయనున్నారు.

షెడ్యూల్ ఇలా..
బుధవారం ఉదయం 9.45 గంటలకు సీఎం వైయ‌స్ జగన్‌ తన తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరతారు. నేరుగా మాచర్లకు చేరుకుంటారు. అక్కడ చెన్నకేశవ కాలనీ ఎదురుగా ఏర్పాటుచేసిన బహిరంగ సమావేశం సభాస్ధలి వద్దనే వరికపూడిసెల ప్రాజెక్టు శంకుస్ధాపన కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం సభలో పాల్గొని ప్రసంగించి.. మధ్యాహ్నం తిరిగి తాడేపల్లి చేరుకుంటారు.

Back to Top