స్థానిక స్వపరిపాలనతో నవశకానికి నాంది

సీఎం వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి 
గ్రామ వాలంటీర్‌ వ్యవస్థను ప్రారంభించిన సీఎం

విజయవాడ:  ప్రజా సంక్షేమ పథకాన్ని ప్రజలకు చేర్చేది వాలంటీర్లే అని వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి అన్నారు. స్థానిక స్వపరిపాలనతో నవశకానికి వైయస్‌ జగన్‌ నాంది పలికారు. గ్రామ వాలంటీర్ల వ్యవస్థను వైయస్‌ జగన్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా  సీఎం మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా రెండున్నర లక్షల మంది వాలంటీర్లు ఉన్నారని చెప్పారు. లంచాలు లేని వ్యవస్థను తీసుకురావాలన్నారు. కులాలు, మతాలు, వర్గాలు, రాజకీయాలు చూడకూడదని, చివరికి ఏ పార్టీ అన్నది చూడకూడదన్నారు. మనం చేసే మంచిని చూసి ఓటు వేసే పరిస్థితి తీసుకురావాలన్నారు. గ్రామంలో మంచి జరగాలన్నదే తన లక్ష్యమని వైయస్‌ జగన్‌ పేర్కొన్నారు. అధికారంలోకి వచ్చిన 3 నెలల్లోపే లక్షల ఉద్యోగాలు ఇచ్చామన్నారు. గ్రామ సెక్రటేరియట్‌ను పూర్తిగా ఉపయోగపడేలా చూడాలన్నారు. 

Back to Top