పాలెం దొర‌స్వామి విగ్ర‌హం ఆవిష్క‌ర‌ణ‌

వైయ‌స్ఆర్ జిల్లా:  పులివెందులలోని హైస్కూల్ కు స్థలం దానం చేసిన  స్వ‌ర్గీయ‌ పాలెం దొర స్వామి విగ్రహాన్ని పార్లమెంట్ సభ్యులు వైయస్ అవినాష్ రెడ్డి ఆవిష్క‌రించారు. దొర‌స్వామి విగ్ర‌హానికి పూల‌మాల వేసి నివాళుల‌ర్పించిన అనంత‌రం ఆయ‌న సేవ‌ల‌ను కొనియాడారు. అనంతరం వైయస్ఆర్ ప్రెస్ క్లబ్ ని వైయ‌స్ అవినాష్‌రెడ్డి ప్రారంభించారు. కార్య‌క్ర‌మంలో మున్సిపల్ ఇంచార్జి వైయస్ మనోహర్ రెడ్డి, వైయస్ మధుసూధన్ రెడ్డి, పాడా ఓయస్డి అనిల్ కుమార్ రెడ్డి , ఆయా కార్పొరేష‌న్ల చైర్మన్లు, పార్టీ నాయకులు, కార్యకర్తలు , అభిమానులు పాల్గొన్నారు.

లోమడ, చిలేకాంపల్లి గ్రామాలలో ఇటివల అనారోగ్యంతో మరణించిన వారి కుటుంబాలను పార్లమెంట్ సభ్యులు వైయస్ అవినాష్ రెడ్డి ప‌రామ‌ర్శించారు.

తాజా వీడియోలు

Back to Top