ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లుకు అస్వస్థత

గుంటూరు: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత, ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు అస్వస్థతతకు గురయ్యారు. బుధవారం కలెక్టరేట్‌ వద్ద అస్వస్థతకు గురి కావడంతో ఆయన్ను ఆసుపత్రికి తరలించారు. రిలే దీక్షలు చేస్తున్న ఎంపీఈవోలతో చర్చించేందుకు వెళ్లిన ఉమ్మారెడ్డి అవస్థతకు గురయ్యారు. విషయం తెలుసుకున్న పార్టీ నేతలు, కార్యకర్తలు ఆసుపత్రి వద్దకు చేరుకున్నారు. ఉమ్మారెడ్డికి మెరుగైన వైద్యం అందించాలని పార్టీ నేతలు డాక్టర్లను కోరారు.
 

తాజా ఫోటోలు

Back to Top