శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలకు రండి

సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌కు ఆహ్వానం

తాడేప‌ల్లి:  శ్రీ‌రామ న‌వ‌మి ప‌ర్వ‌దినం సంద‌ర్భంగా ఒంటిమిట్ట శ్రీ కోదండ రామ‌స్వామి క‌ల్యాణ మ‌హోత్స‌వానికి హాజ‌రు కావాల‌ని టీడీ ఈవో డాక్టర్‌ కేఎస్‌ జవహర్‌రెడ్డి, ఒంటిమిట్ట ఆలయ డిప్యూటీ ఈవో డాక్టర్‌ రమణ ప్రసాద్ ఆహ్వాన ప‌త్రిక అంద‌జేశారు. ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డిని సీఎం క్యాంపు కార్యాలయంలో టీటీడీ ఈవో డాక్టర్‌ కేఎస్‌ జవహర్‌రెడ్డి, ఒంటిమిట్ట ఆలయ డిప్యూటీ ఈవో డాక్టర్‌ రమణ ప్రసాద్‌ శుక్రవారం కలిశారు. ఈ సందర్భంగా ఏప్రిల్‌ 15న జరగనున్న ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి కల్యాణ మహోత్సవం ఆహ్వాన పత్రికను సీఎం వైయ‌స్‌ జగన్‌కు అందజేశారు. వేద పండితులు ముఖ్యమంత్రికి వేద ఆశీర్వచనం ఇచ్చి తీర్థ, ప్రసాదాలు అందించారు.  ఈ నెల 15 వ తేదీ రాత్రి 8 గంటల నుంచి 10 గంటలలోపు పున్నమి వెన్నెల్లో శ్రీ సీతారామ కల్యాణ మహోత్సవం జరగనుంది.

తాజా వీడియోలు

Back to Top