శ్రీవారి భక్తులకు, తెలుగు ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు

తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి

తిరుమల: దేశవ్యాప్తంగా ఉన్న శ్రీ వేంకటేశ్వరస్వామి భక్తులకు, తెలుగు రాష్ట్రాల ప్రజలకు తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలిపారు. శుక్రవారం ఉదయం అభిషేక సేవలో స్వామివారిని వైవీ సుబ్బారెడ్డి దర్శించుకున్నారు. అనంతరం టీటీడీ చైర్మన్‌ మాట్లాడుతూ.. కరోనా నుంచి భక్తులు సురక్షితంగా బయటపడ్డారన్నారు. స్వామివారి ఆశీస్సులతో ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని, సకాలంలో వర్షాలుపడి పంటలు బాగాపండాలని ఆకాంక్షించారు. సీఎం వైయస్‌ జగన్‌ పాలనలో ప్రజలు సంతోషంగా ఉండాలని శ్రీవారిని ప్రార్థించినట్టు టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి చెప్పారు. 
 

Back to Top