మెరుగైన పారిశుధ్య సేవలు అందించడమే క్లాప్‌ లక్ష్యం 

తడి, పొడి చెత్త వాహ‌నాల‌ను ప్రారంభించిన వైవీ సుబ్బారెడ్డి 
 

రాజ‌మండ్రి: గ్రామీణ, పట్టణ, నగర ప్రజలకు మెరుగైన పారిశుధ్య సేవలు అందించడమే లక్ష్యంగా రూపొందించిన ‘క్లీన్‌ ఆంద్రప్రదేశ్‌ (క్లాప్‌)–జగనన్న స్వచ్ఛ సంకల్పం’ కార్యక్రమాన్ని  గాంధీ జయంతి సందర్భంగా సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ప్రారంభించార‌ని టీటీడీ చైర్మ‌న్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. మంగ‌ళ‌వారం రాజమండ్రి ఆర్ట్స్ కాలేజ్ మైదానం లో  జగనన్న స్వచ్ఛ సర్వేక్షన్ క్లీన్ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన పారిశుద్ధ్య స్టాల్స్ సందర్శన , జీటీఎస్‌ శంకుస్థాపన, 61 తడిచెత్త పొడిచెత్త వాహనాలను  టీటీడీ  చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ప్రారంభించారు.  ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రజలు ఆరోగ్యకరమైన పరిసరాల్లో ఆహ్లాదంగా గడపాలన్నదే ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యం​. క్లాప్ కార్యక్రమంలో భాగంగా బిన్‌ ఫ్రీ, లిటర్‌ ఫ్రీ, గార్బేజ్‌ ఫ్రీ రాష్ట్రంగా ఏపీని తీర్చిదిద్దే జాతీయస్థాయి స్వచ్ఛ సర్వేక్షణ్‌ పోటీల్లో ఉత్తమ ర్యాంక్‌ సాధించే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంద‌న్నారు.  రాజమండ్రి కార్పొరేషన్ పరిధిలో పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించడానికి విచ్చేసిన ఉభయ గోదావరి జిల్లాల రీజినల్ కోఆర్డినేటర్, టీటీడీ చైర్మన్  వై.వి.సుబ్బారెడ్డి గారిని కోటిపల్లి బస్టాండ్ వద్ద  వైయ‌స్ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలు ఘ‌న స్వాగతం ప‌లికారు. ఆయా కార్య‌క్ర‌మాల్లో  రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ రామ్, మంత్రివర్యలు కురసాల కన్నబాబు, వేణుగోపాల్, త‌దిత‌రులు పాల్గొన్నారు.

Back to Top