ప్ర‌జ‌ల క‌ష్టాలే మా పార్టీ మేనిఫెస్టో

బ్రాహ్మణ సంఘాల నేతల ఆత్మీయ స‌మ్మేళ‌నంలో వైవీ సుబ్బారెడ్డి  

చిత్తూరు:  ప్రజల కష్టాలనే వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోగా చేసి వాటిని అమలు చేస్తున్న ముఖ్యమంత్రికి అండగా ఉంటూ రాబోయే ఎన్నికల్లో ఫ్యాన్‌ గుర్తుకు ఓటేసి వైయ‌స్సార్‌సీపీ అభ్యర్థి డాక్ట‌ర్ గురుమూర్తిని అఖండ మెజారిటీతో గెలిపించాలని టీటీడీ చైర్మ‌న్ వైవీ సుబ్బారెడ్డి కోరారు. శ‌నివారం తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా తిరుపతి పి ఎల్ ఆర్ కన్వెన్షన్ లో  బ్రాహ్మణ సంఘాల నేతలతో సమావేశం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా  టిటిడి చైర్మన్  వై వి సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. వ్యవస్థలను మేనేజ్‌ చేయడంలో చంద్రబాబు దిట్ట అని, ఆయన ఎన్ని కుయుక్తులు పన్నినా ఎన్నికల్లో వైయ‌స్సార్‌సీపీ విజయాన్ని ఆపలేరని స్పష్టం చేశారు.  తిరుపతి ఉప ఎన్నికల్లో వైయ‌స్సార్‌సీపీ అభ్యర్థి గురుమూర్తికి అత్యధిక మెజార్టీ ఖాయమ‌న్నారు. రెండేళ్ల పాలనలోనే దేశంలోని అత్యుత్తమ ముఖ్యమంత్రుల్లో మూడో సీఎంగా వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి నిలిచారని పేర్కొన్నారు. రానున్న రోజుల్లో అత్యుత్తమ ముఖ్యమంత్రుల్లో వైయ‌స్‌ జగన్‌ మొదటి స్థానంలో నిలుస్తారని ధీమా వ్యక్తం చేశారు.   

చిత్తూరుకు బాబు ఏం చేశారు?
14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు రాష్ట్రానికి అన్నివిధాలా నష్టం చేశారన్నారు. ఆయ‌న సొంత జిల్లా చిత్తూరును ప‌ట్టించుకున్న పాపాన పోలేద‌న్నారు. వైయ‌స్ఆర్‌సీపీ అధికారంలోకి వచ్చాక ఇప్పటివరకు 31 లక్షల పేద కుటుంబాలకు ఇంటి పట్టాలు పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు. సంక్షేమ పథకాలు ఓ వైపు, అభివృద్ధి మరోవైపు, ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో లక్ష్య సాధన దిశగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళుతున్న సీఎం వైయ‌స్‌‌ రాజకీయాల్లో తిరుగులేని నేతగా ఎదిగారన్నారు.   తిరుప‌తి ఉప ఎనిక‌లో ప్ర‌తిప‌క్షాల‌కు డిపాజిట్లు గ‌ల్లంతు అవుతాయ‌ని చెప్పారు.  కార్యక్రమంలో డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి ,  బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్  మల్లాడి విష్ణు, పార్టీ ముఖ్య నేతలు హాజ‌ర‌య్యారు. 

Back to Top