సంక్షేమ పథకాలు ఎల్లోమీడియాకు కనిపించడం లేదా..?

తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి

తాడేపల్లి: సీఎం వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ఎల్లోమీడియాకు కనిపించడం లేదా అని టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి ప్రశ్నించారు. తాడేపల్లిలోని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఇచ్చిన హామీలను సీఎం వైయస్‌ జగన్‌ ఆరు నెలల్లోనే అమలు చేశారని, ఇచ్చిన హామీలే కాదు.. ఇవ్వని హామీలు కూడా అమలు చేశారన్నారు. మహాత్మాగాంధీ, అంబేడ్కర్‌ ఆశయాలకు అనుగుణంగా సీఎం పరిపాలన సాగిస్తున్నారన్నారు. దళితుల కోసం చంద్రబాబు తన 14 ఏళ్ల పాలనలో ఒక్క పథకం అయినా ప్రవేశపెట్టారా.. ? అని ప్రశ్నించారు. గత ప్రభుత్వం రాజధానిలో రోడ్లు కూడా వేయలేకపోయిందని, చంద్రబాబు ప్రపంచంలో ఉన్న అన్ని గ్రాఫిక్స్‌ చూపించి ప్రజలను మోసం చేశాడన్నారు. అభివృద్ధి వికేంద్రీకరణను ప్రజలంతా స్వాగతిస్తున్నారన్నారు. 
 

తాజా వీడియోలు

Back to Top