శ్రీవారి భక్తులకు అసౌకర్యాలు కలుగకుండా చర్యలు

టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి 
 

తిరుమల: వరుస సెలవులు రావడంతో తిరుమల శ్రీవారిని భక్తులు అధిక సంఖ్యలో దర్శించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలుగకుండా ఏర్పాట్లు చేయాలని టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి ఈవోను కోరారు. ఈ మేరకు వైవీ సుబ్బారెడ్డి ట్విట్‌ చేశారు.  వరుస సెలవులు రావడంతో తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తుల సంఖ్య గణనీయంగా పెరిగిందని పేర్కొన్నారు. ఈ పరిణామాన్ని దృష్టిలో ఉంచుకొని స్వామి వారి చెంతకు అధిక సంఖ్యలో వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా సరిపడ ఆహారం, తాగునీరు వంటి ఏర్పాట్లు చేయాలని ఈవోను వైవీ సుబ్బారెడ్డి కోరారు.    

వరుస సెలవులు రావడంతో స్వామిుకు భక్తులువారిని దర్శించుకునేంద పోటెత్తారు. దీంతో తిరుమల కొండలు భక్తులతో కిటకిటలాడుతోంది.  శ్రీవారి దర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం మూడు గంటల్లో పూర్తవుతోంది. భక్తులకు ఇబ్బంది లేకుండా దర్శన ఏర్పాట్లు చేశారు. 

ఘనంగా పవిత్రోత్సవాలు
తిరుమలలో పవిత్రోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఆదివారం నుంచి 13వ తేదీ వరకూ ఈ ఉత్సవాలు కొనసాగుతాయి. ఉత్సవాల్లో భాగంగా మొదటి రోజు పవిత్ర ప్రతిష్ట, రెండోరోజు పవిత్ర సమర్పణ, చివరి రోజు పూర్ణాహుతి నిర్వహిస్తారు. ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకూ స్నపన తిరుమంజనం, సాయంత్రం 6 నుంచి రాత్రి 8 గంటల వరకు ప్రత్యేకంగా అలంకరించిన ఆభరణాలతో శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామి ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరిస్తూ భక్తులకు దర్శనం ఇస్తారు. 
 

Back to Top