రూ.124 కోట్ల‌తో క్యాన్సర్‌ ఆస్పత్రి

శ్రీ బాలాజీ అంకాలజీ ఆస్పత్రికి టీటీడీ చైర్మ‌న్ వైవీ సుబ్బారెడ్డి శంకుస్థాపన
 

 తిరుపతి: వెంకన్న సన్నిధిలో క్యాన్సర్‌ ఆస్పత్రి నిర్మాణానికి అడుగు పడింది. శ్రీ బాలాజీ అంకాలజీ ఆస్పత్రికి  టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రూ. 124 కోట్లతో ఈ ఆస్పత్రిని నిర్మిస్తున్నట్లు తెలిపారు. 
క్యాన్సర్‌ రాకుండా జాగ్రత్తలు, టెస్టుల కోసమే పింక్‌ బస్సులు. చిత్తూరు, తిరుపతిలో పింక్‌ బస్సుల ద్వారా స్క్రీనింగ్‌ నిర్వహిస్తామని వెల్లడించారు. ప్రతీ జిల్లాకు పింక్‌ బస్సులను ఏర్పాటు చేయాలని సీఎం వైయ‌స్ జగన్‌ ఆదేశించార‌ని తెలిపారు. 

ఘాట్ రోడ్ పిట్ట గోడలు మరింత పటిష్టం
తిరుమల ఘాట్ రోడ్‌లో ఎలక్ట్రికల్ బస్సు ప్రమాదానికి గురైన ప్రాంతాన్ని టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి పరిశీలించారు. ఘాట్ రోడ్ లో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ప్రత్యేక చర్యలు చేపడతామని వెల్లడించారు. ఒలెక్ట్ర బస్సు కంపెనీ ప్రతినిధులతో మాట్లాడాం. బస్సు కండిషన్‌ బాగానే ఉందని తెలుస్తోంది. డ్రైవర్‌ నిర్లక్ష్యం వల్లే ఇది జరిగినట్లు భావిస్తున్నాం. ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది. భవిష్యత్ లో ఎలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పటిష్ట చర్యలు తీసుకుంటాం. ఐరన్ క్రాస్ బార్స్ ఎత్తు పెంచుతాము,  ఘాట్ రోడ్ పిట్ట గోడలు మరింత పటిష్టం చేస్తాం. భక్తుల భద్రతకు ప్రత్యేక ప్రాధాన్యతనిస్తామ‌ని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. 

Back to Top