సీఎం వైయస్‌ జగన్‌తో గిరిజన ఎమ్మెల్యేల భేటీ

అసెంబ్లీ​: ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డితో గిరిజన ఎమ్మెల్యేలు భేటీ అయ్యారు. అసెంబ్లీలోని సీఎం కార్యాలయంలో జరిగిన సమావేశంలో డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి, గిరిజన ఎమ్మెల్యేలు రాజన్నదొర, కళావతి, భాగ్యలక్ష్మి, చెట్టి పాల్గుణ, ధనలక్ష్మి పాల్గొన్నారు. జీఓ నంబర్‌ 3పై (షెడ్యూల్‌ ఏరియాల్లో ఉపాధ్యాయుల నియామకాల్లో నూరుశాతం ఎస్టీలనే నియమించాలి) గిరిజన శాసనసభ్యులతో సీఎం వైయస్‌ జగన్‌ చర్చిస్తున్నారు. గిరిజనులకు న్యాయం చేయాలని సీఎం వైయస్‌ జగన్‌కు ఎమ్మెల్యేలు వినతిపత్రం అందజేశారు. గిరిజనుల ప్రయోజనాలను రక్షించడానికి ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుందని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌  స్పష్టం చేశారు. 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top