నేడు ఢిల్లీకి సీఎం వైయస్‌ జగన్ మోహన్ రెడ్డి

పీఎం మోదీతో  భేటీ  
 

అమరావతి:  ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఇవాళ ఢిల్లీ పర్యటనకు వెళ్తున్నారు. ఢిల్లీలో ప్రధాని మోదీతో ఆయన భేటీ కానున్నారు. భేటీ సందర్భంగా ఆర్థికంగా ఇక్కట్లలో ఉన్న ఏపీకి నిధులు ఇచ్చి ఆదుకోవాలని ప్రధానిని వైయస్‌ జగన్ కోరనున్నారు. పోలవరం రివర్స్ టెండరింగ్ వల్ల ఆదా అయిన నిధుల గురించి వివరించనున్నారు. పోలవరంకు గత టీడీపీ ప్రభుత్వం ఖర్చు చేసిన నిధులను విడుదల చేయాలని కోరనున్నారు. వివిధ శాఖలకు కేంద్రం నుంచి రావాల్సిన నిధులను విడుదల చేయాలని కూడా కోరతారు. విద్యుత్ సంస్థల పీపీఏలపై సమీక్షలకు సంబంధించిన అంశంపై కూడా ప్రధానికి వివరించనున్నారు. కడప స్టీల్ ప్లాంట్, రాష్ట్రానికి మేజర్ పోర్టు, వెనుకబడిన జిల్లాలకు నిధుల అంశాన్ని కూడా చర్చించనున్నారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top