వ‌రుస‌గా నాలుగో ఏడాది..నేడు వైయ‌స్ఆర్ మ‌త్స్య‌కార భ‌రోసా  

 

వైయ‌స్సార్‌ మత్స్యకార భరోసా ప్రారంభించనున్న వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి

1,08,755 కుటుంబాలకు లబ్ధి కల్పిస్తూ రూ.109 కోట్లు జమ

23,458 మంది ఓఎన్‌జీసీ బాధిత కుటుంబాలకు రూ.108 కోట్లు 

కోన‌సీమ‌: వరుసగా నాలుగో ఏడాది 'వైయస్ఆర్ మత్స్యకార భరోసా'.. రాష్ట్రవ్యాప్తంగా 1,08,755 మత్స్యకార కుటుంబాలకు వేట నిషేధ సమయంలో 10 వేల చొప్పున రూ.109కోట్లు, ONGC డ్రిల్లింగ్ కారణంగా జీవనోపాధి కోల్పోయిన 23,458 మత్స్యకార కుటుంబాలకు రూ.108 కోట్లు. మొత్తం రూ.217 కోట్లను నేడు జమచేయనున్న సీఎం వైయస్ జగన్. నేడు అందిస్తున్న రూ.109 కోట్ల ఆర్థిక సాయంతో కలిపి మన జగనన్న ప్రభుత్వం అధికారంలోకి వచ్చిననాటి నుండి ఇప్పటివరకు వైయస్ఆర్ మత్స్యకార భరోసా ద్వారా చేసిన సాయం రూ. 418 కోట్లు.

ఈ ఏడాది వైయ‌స్సార్‌ మత్స్యకార భరోసా (వేట నిషేధ భృతి) కింద అర్హులైన 1,08,755 కుటుంబాలకు సీఎం రూ.109 కోట్లు జమ చేయనున్నారు. దీంతో పాటు ఓఎన్జీసీ పైపులైన్‌ కారణంగా జీవనోపాధి కోల్పోయిన కోనసీమ, కాకినాడ జిల్లాలకు చెందిన మరో 23,458 మంది మత్స్యకార కుటుంబాలకు మరో రూ.108 కోట్లు జమ చేయనున్నారు. (గతంలో 14,824 బాధిత మత్స్యకార కుటుంబాలకు రూ.70.04 కోట్ల పరిహారం అందించారు) వైయ‌స్సార్‌ మత్స్యకార భరోసా కింద గంగపుత్రులకు నాలుగేళ్లలో రూ.418.08 కోట్లు లబ్ధి కలుగుతోంది. టీడీపీ ఐదేళ్ల హయాంలో ఈ సాయం కేవలం రూ.104.62 కోట్లు మాత్రమే.

తాజా వీడియోలు

Back to Top