తాడేపల్లి: ప్రజల సమస్యల్ని పరిష్కరించడం కోసం ప్రభుత్వం ప్రారంభించిన ‘జగనన్నకు చెబుదాం’ కార్యక్రమంపై టీడీపీ నీచ రాజకీయాలకు తెరతీసిందని వైయస్ఆర్‌సీపీ అధికార ప్రతినిధి, ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్‌బాబు మండిపడ్డారు. మీడియా సాక్షిగా జగనన్నకు చెబుదాం గ్రీవెన్స్ సెల్‌కు టీడీపీ నేత వర్ల రామయ్య, కార్యకర్తలు మూకుమ్మడిగా ఫోన్లు చేసి వెటకారంగా మాట్లాడుతూ ఉద్యోగులను వేధింపులకు గురిచేయడాన్ని సుధాకర్‌బాబు తీవ్రంగా ఖండించారు. ‘జగనన్నకు చెబుదాం’ కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించడం సిగ్గు చేటు అన్నారు. ప్రతిపక్షాలకు ప్రశ్నించేందుకు సమస్యలు లేక ప్రభుత్వంపై బురద జల్లడమే లక్ష్యంగా ఇష్టం వచ్చినట్లు వ్యవహరించడంపై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల నిజమైన ఫిర్యాదుల పరిష్కారానికి అవకాశం ఇవ్వకుండా రాజకీయ డ్రామాలాడడం టీడీపీ నైజానికి నిదర్శనమని విమర్శించారు. పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తుంటే చంద్రబాబు అడ్డుపడుతున్నారని, ఆయన కళ్లలో రక్తం కారుతుందన్నారు. బుధవారం వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో టీజేఆర్ సుధాకర్‌బాబు మీడియాతో మాట్లాడారు. అమరావతిలో అణగారిన వర్గాలకు నివసించే హక్కు ఎందుకు లేదు? - అమరావతి రాజధానిలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చే అంశంపై హైకోర్టు ఇచ్చిన తీర్పును టీడీపీ, దాని అనుబంధ సంఘాలు వ్యతిరేకిస్తూ సుప్రీం కోర్టుకు వెళ్లిన విధానాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నేను పూర్తిగా ఖండిస్తున్నాను. - 54 వేల మంది పేద వాళ్లకు, నివసించడానికి ఆవాసం లేని అభాగ్యులకు ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్‌గారు ఒక గూడును కల్పిస్తుంటే అడ్డుకోవాలని ప్రయత్నించటం దుర్మార్గం. - హైకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతించాల్సింది పోయి తిరిగి సుప్రీంకోర్టులో వ్యాజ్యం వేయడం దారుణం. - అమరావతి రాజధాని ప్రాంతం అంటే... అదేదో గేటెడ్ కమ్యూనిటీ ప్రాంతంగా, కొంత మంది మాత్రమే నివాసం ఉండే ప్రాంతంగా మీరు అభివర్ణించడం దిక్కుమాలిన రాజకీయం. - అక్కడ నారా చంద్రబాబుకు సంబంధించిన వారు మాత్రమే ఉండాల్సిన సామ్రాజ్యంగా మార్చేశారు. - అమరావతి ప్రాంతంలో అర్హత కలిగిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ పేదవారికి ఇళ్ల స్థలాలు ఇవ్వడంపై ఎందుకు మీకు వ్యతిరేకత అని ప్రశ్నిస్తున్నా. - అంటరానితనం అనే పదాన్ని చంద్రబాబు ఓన్ చేసుకుని... అమరావతిని అంటరాని అమరావతిగా మార్చేశాడు. - పేదవాళ్లెవరూ అక్కడ నివాసం ఉండటానికి యోగ్యత లేదని చెప్పాడు. పేదవాళ్లు నివసించలేని రాజధానిని మేం ఏవిధంగా చూడాలి..?. ఎందుకు మాకు అక్కడ నివసించడానికి అర్హత లేదని మేం సూటిగా అడుగుతున్నాం. - ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు ఆ ప్రాంతంలో నివసిస్తే నీకు, నీ సామ్రాజ్యానికి వచ్చిన ఇబ్బంది ఏంటని చంద్రబాబును ప్రశ్నిస్తున్నాం. - చంద్రబాబు తన సహజసిద్ధ అంటరానితనంతో కూడిన భావజాలంతో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కులాలపై వ్యతిరేకతను చూపిస్తున్నాడు. - వైఎస్సార్సీపీ ప్రభుత్వం పూర్తిగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, పేద వర్గాలకు అండగా నిలవడంతో, చంద్రబాబు, ఆయనకు కొమ్ముకాసే ఈనాడు రామోజీ, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ లాంటి పెత్తందార్లు తట్టుకోలేకపోతున్నారు. చంద్రబాబులో అనువణువునా అస్పృశ్యత ఉంది: - ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఉండి, ఏ మాత్రం సిగ్గులేకుండా అమరావతిలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి వీళ్లేదని చెప్పడం ఆయన చర్యలకు పరాకాష్ట. - 76 ఏళ్ల స్వతంత్య్ర భారతంలో, ఆజాదీకా అమృత్ మహోత్సవాల్లోనూ మా అణగారిన వర్గాలకు అమృతం దొరకడం లేదు. - చంద్రబాబు లాంటి కుహనా రాజకీయ నాయకులు మాత్రం ఇంకా మాపై విషాన్ని చిమ్ముతూనే ఉన్నారు. - ఇది చంద్రబాబు సహజసిద్ధమైన వికృత రాజకీయ చర్య..ఆయనలో అనువణువునా అస్పృశ్యత ఉంది. - చంద్రబాబు రాజకీయ జీవితం మొత్తాన్ని చూస్తే కులాలు, మతాలు, ప్రాంతాల పేరుతో చిచ్చు పెట్టడమే - చంద్రబాబు మమ్మల్ని అంటరాని జాతులుగానే ఇంకా ఉంచాలనుకుంటున్నాడని భావిస్తున్నాం. - అమరావతి ప్రాంతంలో సేకరించిన 50 వేల ఎకరాల సువిశాలమైన ప్రాంతంలో... 50వేల మంది పేదలకు సెంటున్నర స్థలం ఇస్తే, మీకు ఎందుకు అంత ఉక్రోషం వచ్చింది..? - పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడంపై సహేతుకమైన కారణం ఒక్కటీ చూపకుండా అడ్డుకోవాలని చంద్రబాబు చూస్తున్నాడు. - సెంటు భూమి కోసం యుద్ధాలు చేసిన కమ్యూనిస్టు పార్టీలు కూడా.. ఇప్పుడు ఎందుకు చంద్రబాబుకు మద్దతిస్తున్నాయో అర్ధం కావడం లేదు. నువ్వెన్ని కుట్రలు చేసినా నీ ఆటలు సాగవు బాబూ..: - మిస్టర్ చంద్రబాబు..నువ్వు ఎన్ని కుట్రలు చేసినా నీ ఆటలు ఇక సాగవు. - ఎస్సీ,ఎస్టీ,బీసీ,మైనార్టీ, పేద వర్గాలల నాయకుడిగా, వారి కోసమే పుట్టిన వాడిగా 2019లో శ్రీ వైఎస్ జగన్ అనే పాలకుడు పుట్టాడు. - నీ నీతిమాలిన, వికృత, నికృష్ణ రాజకీయాలకు జగన్ గారి సుపరిపాలనే సమాధానం చెబుతోంది. - చంద్రబాబు తాను ఊహించుకున్న అమరావతి కోటలు బద్దలు అవుతున్నాయని ఉక్రోషం పట్టలేక జగన్ గారిపై మాటలతో దాడి చేస్తున్నాడు. - జగన్ గారు పేదలకు సాయం చేయాలని ప్రయత్నం చేసిన ప్రతి సారీ చంద్రబాబు దయ్యంలా అడ్డు పడ్డాడు. - జగన్ గారు అమరావతి ప్రాంతంలో పాదయాత్ర చేస్తే అన్ని కులాలు ఆయనకు బ్రహ్మరథం పట్టాయి. - కానీ చంద్రబాబు మాత్రం తన సహజసిద్ధమైన అంటరాని ధోరణితో ఆ ప్రాంతం మొత్తం పసుపు నీళ్లతో కడిగించాడు. - మాకు అమరావతి ప్రాంతంలో పాదయాత్రలు చేసే అధికారం లేదా..? - ఇప్పుడు పేదలు నివసించేందుకే అనర్హులు అని చెబుతున్నావంటే నిన్ను ఏమనాలి చంద్రబాబూ..? వ్యవస్థలను భ్రష్టు పట్టించినవాడు చంద్రబాబు: - బడుగు బలహీన వర్గాలకు ఈ ప్రభుత్వం సాయం చేసేందుకు ముందుకు వచ్చిన ప్రతి సారీ చంద్రబాబు, ఆయన చుట్టూ ఉన్న ఎల్లో కార్పొరేట్ శక్తులు అడ్డుపడుతూనే ఉన్నారు. - పేదలకు ఇంగ్లీష్ మీడియం విద్య నుంచి ఏ కార్యక్రమం చేపట్టినా.. వాటిని అడ్డుకునే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. మరోవైపు కోర్టుల ద్వారా అడ్డుకుంటూనే ఉన్నారు. - ఈ దేశంలో వ్యవస్థలను భ్రష్టు పట్టించిన వాడు నారా చంద్రబాబునాయడు. వ్యవస్థలను వాడుకోవడం ఎలా అని గ్రంథం రాస్తే చంద్రబాబుపైనే రాయాలి. - రాజధానిలో ఇళ్లు ఇస్తే పేద వర్గాల్లో ఆనందభాష్పాలు వస్తున్నాయి.. కానీ చంద్రబాబుకు, ఆయనకు వత్తాసు పలికే ఎల్లో బ్యాచ్ కు మాత్రం రక్త కన్నీరు వస్తోంది. - తన కుటిల రాజకీయానికి జగన్‌గారు ఫుల్‌స్టాప్ పెట్టాడనే చంద్రబాబుకు ఈ ఉక్రోషం. ఆ భూమిని ఇలానే వాడాలనే హక్కు ఎవరికీ లేదు: - అమరావతి మాస్టర్ ప్లాన్ ప్రజాభిప్రాయంతో, అందరి అంగీకారంతో ఏర్పడిందా..? అంటే లేదు. రైతుల పేరుతో అడ్డుకోవడం ఏంటి..ఎక్కడన్నా ఉందా ఈ చోద్యం. - రైతులకు, ప్రభుత్వానికి మధ్య ఉన్న ఒప్పందం ఈ రోజుకీ రద్దు కాలేదు. - ప్రభుత్వానికి భూమి ఇచ్చిన తర్వాత ఆ ప్రాంతంలో ప్రభుత్వం తనకు నచ్చిన విధంగా భూమిని వినియోగించుకునే హక్కు రాజ్యాంగ పరంగా ఉంది. - ఆ భూమిని ఇలానే వాడాలి అని చెప్పే అధికారం ఎవరికీ లేదు. - అమరావతిలో శాసన రాజధాని ఉండి తీరుతుంది.. విశాఖలో పరిపాలన రాజధాని, కర్నూలులో న్యాయ రాజధాని ఉంటుంది. - సరైన సమయంలో ఆ బిల్లును శాసనసభలో ప్రవేశ పెడతారు. - సెప్టెంబర్ నుంచి ముఖ్యమంత్రి గారు విశాఖలో నివసించబోతున్నారు. సమస్యలు జగనన్నకు చెప్పమన్నా అపహాస్యమేనా..?: - ప్రజల సమస్యలను మరింత వేగంగా పరిష్కరించటం కోసం.. సీఎంవో నుంచి స్థానిక అధికారుల వరకు అందర్నీ భాగస్వాములను చేస్తూ, జగనన్నకు చెబుదాం అనే కార్యక్రమాన్ని మొదలు పెట్టారు. - వర్ల రామయ్యను టీడీపీ ఆఫీసులో కూర్చోబెట్టి... ఆ కార్యక్రమాన్ని అవహేళన చేసే విధంగా చంద్రబాబు పనికిమాలిన రాజకీయం చేస్తున్నాడు. - ఇందుకోసమేనా చంద్రబాబు రాజకీయాల్లో ఉంది. అంతటి మంచి కార్యక్రమాన్ని ఒక ప్రతిపక్ష పార్టీగా ఎందుకు స్వాగతించలేదు..? - గుడ్ గవర్నెన్స్ ఇవ్వాలని, ఒక యువ ముఖ్యమంత్రికి వచ్చిన ఆలోచనను మెచ్చుకోవాల్సిందిపోయి, రాజకీయ విమర్శలు చేయడానికి మీకు సిగ్గు ఎక్కడ లేదు..? - వర్ల రామయ్య సహేతుకమైన సమస్యలను ఈ ప్రభుత్వం దృష్టికి తీసుకువస్తే బాగుండేది. - అర్హత కలిగిన ప్రతి వర్గానికీ, పేదవానికి న్యాయం చేయాలనే సంకల్పంతో జగనన్నకు చెప్పండి అన్నాడు. - జగన్ గారు ప్రతిపక్షానికి ఒక చాలెంజ్ కూడా విసిరారు. మీకు చెప్పడానికి సమస్యలు లేక టీడీపీ ఆఫీసులో కూర్చుని గేలి చేయడం అనైతికం. - అంటే మీ దగ్గర సమస్యలు లేవని అర్ధం అవుతోంది. బాబు అండ్ కో ఆర్ధిక పుష్టి తగ్గితే.. రాష్ట్రం దివాళా తీసినట్టా రామోజీ..?: - ఆంధ్రప్రదేశ్ ఆర్ధిక వ్యవస్థ గురించి ఓ నిపుణుడు చెప్పాడు..ఈనాడు రామోజీ రాశాడు. - స్వయం ప్రకటిత ఆర్ధిక నిపుణులు..అలా మాట్లాడటానికి సిగ్గుండాలి. - పింఛన్, అమ్మ ఒడి లాంటి అనేక పథకాలు అందించడం తప్పా..? - నువ్వు ఎక్కడ చదివావు.. రాష్ట్ర సంపద.. ఆరాష్ట్రంలో నివసించే ప్రజల కోసం కాదా..? - ఆ నలుగురు సంపాదించుకుంటేనే ఆర్ధిక వ్యవస్థ బాగున్నట్టా... - పేదవాడికి రూ. 2.08 లక్షల కోట్ల డీబీటీ ద్వారా నేరుగా వారి అకౌంట్లల్లోకి వెళితే అది మీకు నచ్చడం లేదు... - బుద్ధి ఉన్నవాడు ఎవడైనా.. పేదలకు కడుపునిండా అన్నం పెట్టే జగన్ గారి పరిపాలన చూసి హర్షిస్తున్నారు. - కోవిడ్ మహమ్మరి వస్తే.. పేదవాడికి నేరుగా డబ్బులిచ్చి కొనుగోలు శక్తి పెంచిన మానవతావాది, ముఖ్యమంత్రి జగన్ గారు. - పచ్చదండు మేథావుల ముసుగులో.. వారి మాటలను మీ ఎల్లో పత్రికల్లో అచ్చేసి, మీ భావజాలాన్ని ప్రచారం చేసుకోవడం దుర్మార్గం. మీ ఎత్తులన్నీ ప్రజలకు తెలుసు. మీకు ఎప్పుడు, ఎలా బుద్ధి చెప్పాలో అప్పుడు చెబుతారు.