థ్యాంక్యూ జగనన్న

ఏపీ దిశ యాక్టు తీసుకువస్తుందన్నందుకు కృతజ్ఞతలు

సీఎంకు రాఖీ కట్టిన మహిళా మంత్రులు, ఎమ్మెల్యేలు

సచివాలయం: ఆంధ్రప్రదేశ్‌ దిశ యాక్ట్‌ను ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మహిళా మంత్రులు, ఎమ్మెల్యేలు రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు. అసెంబ్లీలో సీఎం చాంబర్‌లో మహిళా మంత్రులు, ఎమ్మెల్యేలు సీఎం వైయస్‌ జగన్‌ను కలిశారు. దిశ యాక్టును తీసుకువస్తుందన్నకు కృతజ్ఞతలు తెలుపుతూ రాఖీ కట్టి, స్వీట్లు తినిపించారు. సీఎంను కలిసిన వారిలో డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి, హోంమంత్రి సుచరిత, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత, ఎమ్మెల్యేలు ఆర్కే రోజా, విడదల రజిని, ఉషశ్రీచరణ్, కళావతి, రెడ్డిశాంతి, భాగ్యలక్ష్మి, ధనలక్ష్మి, ఉండవల్లి శ్రీదేవి ఉన్నారు.

Read Also: సమానమైన విద్యతోనే అభివృద్ధి సాధ్యం  

Back to Top