సమానమైన విద్యతోనే అభివృద్ధి సాధ్యం  

ఎమ్మెల్యే మొండితోక జగన్‌మోహన్‌రావు
 

అసెంబ్లీ: పిల్లలందరికీ సమాన విద్య అందించినప్పుడు రాష్ట్రం మొదటి స్థానంలో ఉంటుందని, అభివృద్ధి సాధ్యమవుతుందని వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే మొండితోక జగన్‌మోహన్‌రావు పేర్కొన్నారు. ఇంగ్లీష్‌ మీడియంపై అసెంబ్లీలో జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. 
ప్రైవేట్‌ స్కూళ్లలో అధికంగా ఇంగ్లీష్‌ మీడియం చెబుతున్నారు. సీఎం వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి  ఎడ్యుకేషన్‌ సిస్టమ్‌ను మార్పు చేస్తున్నారు.  స్కూళ్లలో రూపురేఖలు మార్చేందుకు శ్రీకారం చుట్టారు. ఎడ్యుకేషన్‌ అన్నది నేర్చుకోవడానికి అనుకూలంగా ఉండటమే. నాలెడ్జ్‌ కోసం పుస్తకాలు చదవడమే ఎడ్యుకేషన్‌ కాదు. స్కిల్స్‌, నాలెడ్జ్‌ పెంచుకోవాలి. ఉన్న పుస్తకాలను ఇంగ్లీష్‌లో మార్పు చేయడం కాదు..ప్రభుత్వం విద్యార్థుల్లో నైపుణ్యం, కొత్త విషయాలను నేర్పించేందుకు ఇంగ్లీష్‌లో మార్పు తీసుకువస్తున్నారు. ఇప్పటివరకు ప్రభుత్వ స్కూళ్లలో ఎస్సీ జనాభాలో 10 లక్షల మంది ప్రభుత్వ స్కూళ్లలో చదువుతున్నారు. ఎస్టీ జనాభాలో 4 లక్షల మంది, బీసీల్లో 36 లక్షల జనాభాలో 21 లక్షల మంది చదువుతున్నారు. ఓసీల్లో ఉన్న 15 లక్షల్లో 5 లక్షల మంది ప్రభుత్వ స్కూళ్లలో, 10 లక్షల మంది ప్రైవేట్‌ స్కూళ్లలో చదువుతున్నారు. గతంలో అందరూ ప్రభుత్వ స్కూళ్లలోనే చదివే వారు. ఇప్పుడు డబ్బులున్న వారు ప్రైవేట్‌ స్కూళ్లలో, డబ్బులు లేని వారు ప్రభుత్వ స్కూళ్లలో చదివే రోజులు వచ్చాయి. ప్రైవేట్‌ స్కూళ్లలో 96 శాతం ఇంగ్లీష్‌ మీడియంలో ఉంది. ప్రభుత్వ స్కూళ్లో 70 శాతం తెలుగు మీడియం ఉంది. ఇప్పుడు ఇంగ్లీష్‌ మీడియం ప్రవేశపెట్టడం వల్ల తెలుగుకు ఏమైనా ప్రమాదం  వస్తుందా? ఇంతకాలం రాని ఇబ్బందులు ఇప్పుడు ఎలా వస్తాయి. ఈ భాషాను కాపాడేది, సంస్కృతిని కాపాడేది తెలుగు మీడియం చదివే పిల్లలేనా? అన్నది విమర్శలు చేసే వారు ఆలోచన చేయాలి. ఎక్కడైతే ఆర్థికంగా బాగున్నారో వారు ఇంగ్లీష్‌ మీడియం అడుతున్నారు.  ఎడ్యుకేషన్‌ సిస్టమ్‌ను మార్పు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకుంది. సమానమైన విద్యను ఇచ్చేందుకు ప్రభుత్వ పాఠశాలల్లో కూడా ఇంగ్లీష్‌ మీడియం ప్రవేశపెడుతున్నారు. రానున్న రోజుల్లో ప్రభుత్వ స్కూళ్లు అన్నింటికంటే మిన్నగా ఉంటాయని బలంగా నమ్ముతున్నాను. ప్రభుత్వ స్కూళ్లలోని టీచర్లు ఇంగ్లీష్‌ మీడియం చెబుతారా అన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. బీఈడ్‌ చేసిన వారు ప్రభుత్వ స్కూళ్లలో అవకాశం వస్తే పని చేస్తారా? లేక ప్రైవేట్‌ స్కూళ్లకు వెళ్తారా?. ప్రభుత్వ పాఠశాలలో పని చేయాలంటే పోటీ పరీక్షలో నెగ్గాల్సి ఉంటుంది. చదివిన ప్రతి వారు టెన్త్‌ వరకు ఇంగ్లీష్‌ సబ్జెట్‌ ఉంటుంది. ఉపాధ్యాయులకు ప్రభుత్వం శిక్షణ కూడా ఇస్తుంది. కాబట్టి ఎలాంటి అనుమానాలు అవసరం లేదు. సమానమైన విద్య అందినప్పుడే రాష్ట్రం మొదటిస్థానంలో ఉంటుంది. 

Read Also: పులిపాల విలువ పులిబిడ్డకే తెలుసు

తాజా ఫోటోలు

Back to Top