పులిపాల విలువ పులిబిడ్డకే తెలుసు

విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌
 

 

అసెంబ్లీ: ఇంగ్లిష్‌ భాషను 70 సంవత్సరాల క్రితమే డాక్టర్‌ బీఆర్‌.అంబేడ్కర్‌ పులిపాలతో పోల్చారని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ అన్నారు. ఇంగ్లిష్‌ మాధ్యమం మీద పట్టుసాధించాలి. ఇంగ్లిష్‌ నేర్చుకోవడం వల్ల చాలా బలవంతులు అవుతారని అంబేడ్కర్‌ చెప్పారన్నారు. పులిపాలతో పోల్చారు కాబట్టి పులిపాల విలువ ఒక పులిబిడ్డకే తెలుసు కాబట్టి సీఎం వైయస్‌ జగన్‌ పులిబిడ్డ కాబట్టి ఆ పులిపాలు అంటే ఈ రాష్ట్ర ప్రజలందరికీ రుచి చూపించాలని ఇంగ్లిష్‌ మాధ్యమాన్ని ప్రవేశపెట్టాలని నిర్ణయం తీసుకున్నారన్నారు.

అసెంబ్లీలో విద్యాశాఖ మంత్రి మాట్లాడుతూ.. ‘ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం బోధన చేపట్టేందుకు సీఎం వైయస్‌ జగన్‌ తీసుకున్న నిర్ణయం చరిత్రాత్మకమని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ అన్నారు. జీఓ నంబర్‌ 85 ద్వారా వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఆంధ్రప్రదేశ్‌లో ఒకటి నుంచి 6వ తరగతి వరకు ఇంగ్లిష్‌ మాధ్యమాన్ని ప్రవేశపెడుతూ క్రమక్రమంగా ప్రతీ సంవత్సరం తరగతిని పెంచుకుంటూ నాలుగేళ్లలో పదో తరగతి వరకు తీసుకెళ్తాం. నూతన ప్రక్రియ ఆంధ్రప్రదేశ్‌లో శ్రీకారం చుట్టుకుంది. ఈ చర్చపై అన్ని పత్రికలు టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా, ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్, అంతర్జాతీయ పత్రిక స్ట్రయిట్‌ టైమ్స్‌ సింగపూర్‌ పత్రిక ఆంధ్రప్రదేశ్‌ ఆంగ్ల మాధ్యమం గురించి కథనాలు రాశాయి. ఇంగ్లిష్‌ మీడియం బోధనను రాజకీయం చేసుకోవాలని ప్రతిపక్ష నేత చంద్రబాబు కూడా తెలుగు భాషను చంపేస్తున్నారు.. తొక్కిపడేస్తున్నారు.. అంతరించిపోతుంది అని విపరీతమైన దుష్ప్రచారం చేశారు. మతం రంగు కూడా పులిమి ప్రచారాలు చేశారు. తరువాత అలవాటు అయిన విద్య యూటర్న్‌ తీసుకొని మేము వ్యతిరేకం కాదని సన్నాయినొక్కులు నొక్కుతూ.. స్పష్టమైన వైఖరి చెప్పలేదు.

ఇంగ్లిష్‌ మీడియం బోధనకు చంద్రబాబు అనుకూలమా..? వ్యతిరేకమా..? చెప్పాలి.  ఏపీ దిశ చట్టం చేశారు. ఏదైనా నిర్ణయం తీసుకోవాలంటే దానికి ధైర్యం కావాలి.. సీఎం వైయస్‌ జగన్‌ నిర్ణయం తీసుకోవడమే ఆలస్యం అంతే.. నిర్ణయం తీసుకున్న వెంటనే అమలు జరుగుతుంది. రివర్స్‌టెండరింగ్‌ విషయంలో కూడా అపహాస్యం చేశారు. వేల కోట్లు రివర్స్‌టెండరింగ్‌ ద్వారా ఆదా చేశాం. నవంబర్‌ 14వ తేదీన ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ ఒంగోలులో నాడు నేడు కార్యక్రమం ప్రారంభిస్తున్నప్పుడు ఎందుకు ఇంగ్లిష్‌మాధ్యమాన్ని ప్రవేశపెట్టామని వివరించారు. లెవల్‌ ప్లేయింగ్‌ ఫీల్డ్‌ ఎందుకు ఇవ్వలేకపోయారు, కుప్పంలో గత ఐదు సంవత్సరాల్లో ఎన్ని ప్రైమరీ స్కూళ్లు 50 శాతం 2014–19 ఓపెన్‌ చేశారు. ఆ స్కూళ్లలో స్థితిగతులు ఉన్నాయా..? గౌరవ ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ కుప్పం నియోజకవర్గంలో కూడా 216 స్కూళ్లు ఉన్నాయంటే.. ఆ స్కూళ్ల స్థితిగతులు మార్చేందుకు కూడా నిధులు కేటాయిస్తామని చెప్పారు.

అనేక సాంకేతిక పరిజ్ఞానాలు వస్తున్న నేపథ్యంలో పిల్లలను ఏ విధంగా తర్ఫీదు చేయాలని సీఎం వైయస్‌ జగన్‌ ఆలోచన చేశారు. చంద్రబాబు 2020కి ఇలా అవుతాం. 2022కి దేశంలో మొదటి ఐదు స్థానాల్లో ఉంటాం. 2050కి ప్రపంచ స్థాయికి అని ఒట్టి మాటలు మాట్లాడారు. మేము మాటలు చెప్పం, చేతలు చేస్తాం. విద్యా వ్యవస్థ మీద పెట్టుబడి సమాజం మీద పెట్టుబడిలా ఉండాలి. ఈ ప్రభుత్వం విద్యాశాఖకు చేసిన ∙కేటాయింపులు ఎప్పుడైనా జరిగాయా..? రూ.33 వేల కోట్లు బడ్జెట్‌లో 16 నుంచి 18 శాతం కేటాయించారు.

ఇంగ్లిష్‌ భాష గురించి 70 సంవత్సరాల క్రితమే డాక్టర్‌ బీఆర్‌.అంబేడ్కర్‌ చెప్పారు. ఇంగ్లిష్‌ను సింహం పాలతో పోల్చారు. ఇంగ్లిష్‌ మాధ్యమం మీద పట్టుసాధించాలి. ఇంగ్లిష్‌ నేర్చుకోవడం వల్ల చాలా బలవంతులు అవుతారని చెప్పారు. పులిపాలతో పోల్చారు కాబట్టి పులిపాల విలువ ఒక పులిబిడ్డకే తెలుసు కాబట్టి సీఎం వైయస్‌ జగన్‌ పులిబిడ్డ కాబట్టి ఆ పులిపాలు అంటే ఈ రాష్ట్ర ప్రజలందరికీ రుచి చూపించాలని ఇంగ్లిష్‌ మాధ్యమాన్ని ప్రవేశపెట్టాలని నిర్ణయం తీసుకున్నారు. మన దేశంలో ఎన్నో భాషలు, ఎన్నో సంప్రదాయాలు, ఎన్నో ఆచార వ్యవహారాలు ఉన్నాయి. అయినా ఇంటర్నేషనల్‌ లాంగ్వేజ్‌ కావాలి. కంప్యూటర్‌ భాష కావాల్సిన అవసరం ఉంది. దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి ఇంగ్లిష్‌మీడియాన్ని రాష్ట్రానికి పరిచయం చేశారు.

45 వేల స్కూళ్లకు గాను 96 శాతం ఏ విధంగా ఇంగ్లిష్‌ మీడియం పాఠశాలలు ప్రైవేట్‌ మేనేజ్‌మెంట్‌లో ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో ప్రైవేట్‌ స్కూళ్లను పెట్టలేరు. ప్రతి పేదపిల్లల తల్లిదండ్రులు వారి పిల్లలను ఇంగ్లిష్‌ మీడియంలో చదివించుకోవాలనే ఆశ ఉంటుంది. దాన్ని సొమ్ము చేసుకుంటూ ప్రైమరీ స్కూల్‌ సెక్షన్స్‌లో ఎక్కువగా ఇంగ్లిష్‌మీడియం స్కూళ్లు వచ్చిన వైనాన్ని సభ దృష్టికి తీసుకువస్తున్నాను. లెవల్‌ ప్లేయింగ్‌ ఫీల్డ్‌ అనేది ఎక్కడా లేదు. సామాజిక శాస్త్రవేత్తగా అందరికీ లెవల్‌ ప్లేయింగ్‌ ఫీల్డ్‌ ఇవ్వాలని అంబేడ్కర్‌ భావజాలాన్ని పునికిపుచ్చుకొని ఇంగ్లిష్‌ మీడియం విద్య అందిస్తే వంద ఎకరాల ఆస్తి ఇచ్చినట్లు అవుతుందని అంబేడ్కర్‌ చెప్పారు. ఆ స్ఫూర్తితో సీఎం వైయస్‌ జగన్‌ ఇంగ్లిష్‌మీడియం తీసుకువచ్చారు.

తెలుగు భాష ఔన్నత్యానికి ప్రభుత్వం కచ్చితంగా కట్టుబడి ఉంది. తెలుగు సబ్జెక్టును  కంపల్సరీ చేస్తూ కేబినెట్‌లో కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. ప్రతిపక్షానికి తెలుగు భాష మీద అంత ప్రేమ ఉంటే తెలుగు భాషా పండితులకు 15 సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉన్న పదోన్నతలు ఎందుకు ఇవ్వలేని ప్రశ్నిస్తున్నాను. సీఎం వైయస్‌ జగన్‌ పదోన్నతులపై సమీక్ష జరిపి పారదర్శకంగా ఇవ్వాలంటే వారం రోజుల్లో ఇచ్చేశాం. తెలుగు భాష వికాసానికి కట్టుబడి ఉన్నాం. కార్పొరేషన్‌ను కూడా ఏర్పాటు చేశాం. తెలుగు భాష కార్పొరేషన్‌ చైర్‌పర్సన్‌గా నందమూరి లక్ష్మీపార్వతిని నియమించాం. ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయానికి మద్దతు తెలపాలని సభ్యులను మంత్రి సురేష్‌ కోరారు.

Read Also: హిందూ ధార్మిక చట్ట సవరణ, ఎక్సైజ్‌ అమెండ్‌మెంట్‌ బిల్లులకు అసెంబ్లీ ఆమోదం

Back to Top