తల్లీబిడ్డా ఎక్స్‌ప్రెస్‌లను పరిశీలించిన సీఎం

విజయవాడ: వైయస్‌ఆర్‌ తల్లీబిడ్డ వాహనాలను ప్రారంభించేందుకు ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విజయవాడ బెంజ్‌ సర్కిల్‌కు చేరుకున్నారు. సీఎం వైయస్‌ జగన్‌కు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అధికారులు ఘనస్వాగతం పలికారు. అనంతరం తల్లీబిడ్డా ఎక్స్‌ప్రెస్‌లను సీఎం వైయస్‌ జగన్‌ పరిశీలించారు. వాహనాల్లోని సదుపాయాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. మరికాసేపట్లో వాహనాలను ప్రారంభించనున్నారు.

Back to Top