తెలంగాణ ఉద్యోగులను సొంత రాష్ట్రానికి పంపించండి

సీఎం వైయస్‌ జగన్‌ నిర్ణయం పట్ల ఉద్యోగుల హర్షం

తాడేపల్లి: తెలంగాణకు చెందిన ఉద్యోగులను వారి సొంత రాష్ట్రానికి పంపించాలని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశారు. బుధవారం సీఎం వైయస్‌ జగన్‌ను ఏపీలో పని చేస్తున్న తెలంగాణ ప్రాంత ఉద్యోగులు కలిసి తమ ఇబ్బందులను వివరించారు. తమను తెలంగాణ రాష్ట్రానికి పంపాలని సీఎం వైయస్‌ జగన్‌ను ఉద్యోగులు కోరారు. గతంలోనే రెండు రాష్ట్రాల సీఎంల సమావేశంలో కేసీఆర్‌ వద్ద ఈ విషయాన్ని సీఎం వైయస్‌ జగన్‌ ప్రస్తావించారు. ఇందుకు తెలంగాణ ప్రభుత్వం సానుకూలంగా స్పందించి తెలంగాణ నుంచి ఫైల్‌ ఏపీకి పంపించింది. వెంటనే ఫైల్‌ క్లియర్‌ చేసి ఉద్యోగులను తెలంగాణకు పంపాల్సిందిగా సీఎం వైయస్‌ జగన్‌ ఆదేశాలు జారీ చేశారు. సీఎం వైయస్‌ జగన్‌ గొప్ప మనసుతో అంగీకరించి గ్రీన్‌సిగ్నల్‌ ఇవ్వడంతో ఉద్యోగులు హర్షం వ్యక్తం చేశారు.
 

Back to Top