కాకినాడ జిల్లా: నర్సాపురం పార్లమెంటు వైయస్ఆర్‌సీపీ పరిశీలకులు ముదునూరి మురళీకృష్ణంరాజుపై టిడిపి కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోంది. మురళీకృష్ణంరాజు తండ్రి రామరాజు(86) పై లైగింక వేధింపులు, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయడం దుర్మార్గమైన చర్యగా వైయస్ఆర్‌సీపీ నేతలు అభివర్ణిస్తున్నారు. ఫించన్లు పంపిణీ సందర్భంగా ఈనెల 1వ తేదిన ధర్మవరంలో మురళీకృష్ణంరాజు నివాసానికి వెళ్ళిన సచివాలయం మహిళ సంరక్షణ కార్యదర్శి రాధిక..జగన్నాధరాజు అనే ఫించన్ దారుని చిరునామా కోసం రామరాజును ఆమె వివరాలు అడిగారు. ఈ సమయంలో తనను 86 ఏళ్ళ రామరాజు లైగింకంగా వేధించారని ఆరోపిస్తూ ప్రత్తిపాడు పిఎస్ లో ఆమె ఫిర్యాదు చేశారు. రాధిక ఫిర్యాదు మేరకు ఆగమేఘాలపై పోలీసులు లైగింక వేధింపులు, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. నాపై కక్షతో మా నాన్నపై అక్రమ కేసు: మురళీకృష్ణంరాజు `టిడిపి కుట్రతోనే నా తండ్రిపై అక్రమ కేసు నమోదు చేశారు. ప్రత్తిపాడు ఎంపిడీవో కుమార్ ఈ కేసు వెనుక ఉన్నారు. వరుపుల రాజా మరణానికి కారకులైన వ్యక్తులతో ఎమ్మెల్యే సత్యప్రభ చేతులు కలిపారు. ఆ కారణం చేతనే టిడిపిని వదిలి వేశాను. దీంతో నామీద కక్ష సాధించేందుకు నా తండ్రిపై కేసు నమోదు చేశారు. 86 సంవత్సరాల వయస్సులో నా తండ్రి ఆనారోగ్య రుగ్మలతో భాధపడుతున్నారు. ఆయనకు దుస్తులు మార్చడం, ఆహరం తినిపించడం మేమే చేస్తాం. ప్రతి పక్షంలో ఉన్న నన్ను మానసిక క్షోభ పెట్టాలని ..నా తండ్రి ని అవమానించేలా కేసు పెట్టారు. కలెక్టర్, ఎస్పీ ఈ కేసును నిష్పక్షపాతంగా విచారించాలి` అని వైయస్ఆర్‌సీపీ పరిశీలకులు ముదునూరి మురళీకృష్ణంరాజు కోరారు. మురళీకృష్ణంరాజుకు పరామర్శ మురళీకృష్ణంరాజును వైయస్ఆర్‌సీపీ ప్రత్తిపాడు నియోజకవర్గ సమన్వయకర్త ముద్రగడ గిరిబాబు, మాజీ ఎమ్మెల్సీ లక్ష్మీ శివకుమారి, ఎంపీపీ కాంతి సుధాకర్ పరామర్శించారు. మురళీకృష్ణంరాజు తండ్రిపై పెట్టిన కేసు తప్పని తేలితే ఎంపిడీవో కుమార్పై చర్యలు తీసుకోవాలని ముద్రగడ గిరిబాబు డిమాండ్ చేశారు.