రాష్ట్రంలో దోపిడీ పాలన సాగుతోంది

చిలుకలూరిపేటలో టీడీపీ అక్రమాలకు అంతు లేదు

జగనన్న  వస్తాడు..చెరసాల నుంచి విడిపిస్తాడు

వైయస్‌ఆర్‌సీపీ చిలకలూరిపేట అభ్యర్థి విడదల రజనీ

గుంటూరు: చిలుకలూరిపేట నియోజకవర్గంలో  దోపిడీ రాజ్యాన్ని తయారుచేశారని, ఆ చెరసాల నుంచి విడిపించడానికి వైయస్‌ జగన్‌ వచ్చారని చిలుకలూరిపేట వైయస్‌ఆర్‌సీపీ అసెంబ్లీ అభ్యర్థి విడదల రజనీ అన్నారు.  జగనన్న కోసం జనమంతా రావాలని, రాజన్న రాజ్యం రావాలన్నారు.చిలుకలూరిపేట నియోజకవర్గంలో లెక్కలేనని అక్రమాలు జరిగాయన్నారు. చిలకలూరిపేట నియోజకవర్గంలో దళిత భూములను ఆక్రమించి అక్రమాలకు పాల్పడ్డరన్నారు.í Üసిఐ వారు 43 మార్కెట్‌ యార్డ్‌లలో పత్తికొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తే ప్రత్తిపాటి పుల్లారావు,ఆయన అనుచరులు రైతులందరి వద్ద ఐదువేలకు కొనుగోలు చేసి..సిసిఐలో నాలుగువేలు మాత్రమే ఇచ్చి రైతుల పొట్టగొట్టారని దుయ్యబట్టారు.పత్తిపాటి పుల్లారావు వొంగేరు ఒడ్డున నాలుగు కోట్లు విలువైన భూములను  ప్లాటు చేయించి తన సొంతవారికి అమ్ముకున్నారని ఆరోపించారు.కొండవీడు ఘాట్‌ రోడ్డు కాంట్రాక్టర్లతో టీడీపీ పార్టీ కార్యాలయం నిర్మించుకున్నారని మండిపడ్డారు.చిలకలూరిపేటలో అనేక అక్రమాలకు పాల్పడ్డారన్నారు. చిలుకలూరిపేటలో అక్రమాలు,హత్య రాజకీయాలు ప్రత్తిపాడు పుల్లారావు ఆధ్వర్యంలో జరుగుతున్నాయని ఆరోపించారు.

 

Back to Top