900 ఎకరాలు కొట్టేసేందుకు కుట్ర

దెందులూరులో పెట్రేగిపోతున్న చింతమనేని ఆగడాలు

ఎస్పీకి ఫిర్యాదు చేసిన కోటగిరి శ్రీధర్, కొఠారి అబ్బాయిచౌదరి

పశ్చిమగోదావరి: రెండు వర్గాల మధ్య తగాదాలు పెట్టి చెరువు భూమిని అప్పనంగా కాజేయాలని టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ కుట్ర పన్నుతున్నాడని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఏలూరు పార్లమెంట్‌ నియోజకవర్గ పరిశీలకుడు కోటగిరి శ్రీధర్‌ మండిపడ్డారు. ప్రత్తికోళ్లంక వివాదంపై గ్రామస్తులతో కలిసి జిల్లా ఎస్పీ రవిప్రకాష్‌కు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా కోటగిరి శ్రీధర్, దెందులూరు సమన్వయకర్త కొఠారి అబ్బాయి చౌదరిలు మాట్లాడుతూ.. రెండు వర్గాల మధ్య తగదాలు సృష్టించి ఆ చెరువులను కాజేయాలని చింతమనేని ప్రయత్నిస్తున్నారన్నారు. 900 ఎకరాల కోసం గ్రామంలో భయానక వాతావరణం సృష్టిస్తున్నారని ధ్వజమెత్తారు. దెందులూరు నియోజకవర్గంలో ప్రజాస్వామ్యం ఖూనీ చేస్తున్నారని,  గ్రామంలోకి వెళ్లాలంటే ప్రజలు భయపడుతున్నారన్నారు. బాధితులకు న్యాయం జరిగే వరకు వైయస్‌ఆర్‌ సీపీ అండగా ఉంటుందన్నారు. 

Back to Top