టీడీపీ నేత‌ల బ‌రితెగింపు

నంద్యాల జిల్లాలో వైయ‌స్ఆర్‌సీపీ నేత‌పై వేట‌కొడ‌వ‌ళ్ల‌తో దాడి

ప‌రిస్థితి విష‌మం..ఆసుప‌త్రికి త‌ర‌లింపు

నంద్యాల జిల్లా:  అధికార తెలుగు దేశం పార్టీ నేత‌లు బ‌రితెగించారు. నంద్యాల జిల్లా బనగానపల్లె నియోజకవర్గంలో వైయస్ఆర్ కాంగ్రెస్‌ పార్టీ నాయకుడిపై టీడీపీ నేత‌లు వేట కొడ‌వ‌ళ్ల‌తో హత్యాయత్నానికి పాల్ప‌డ్డారు. కోవెలకుంట్ల మండలం కంపమల్ల గ్రామం వైయస్ఆర్‌సీపీ పార్టీ నాయకుడు లోకేశ్వర్ రెడ్డి పై అదే గ్రామానికి చెందిన టిడిపి నాయకులు దాడి చేశారు. బుధ‌వారం రాత్రి పది గంటల సమయంలో టిడిపి పార్టీ నాయకులు, అనుచరులు ఇంటిపై దాడి చేసి ఇంట్లో లోకేశ్వర్ రెడ్డి లేకపోవడంతో కుటుంబ సభ్యుల మీద దాడి చేశారు.  ఇంట్లో ఉన్న  కుటుంబ సభ్యులు, లోకేష్ తండ్రి వెంకట్రామిరెడ్డి, తమ్ముడు వెంకటేశ్వర రెడ్డి  ప‌చ్చ‌నేత‌ల దాడిలో గాయ‌ప‌డ్డారు. లోకేశ్వర్ రెడ్డిని పొలంలో రాడ్లు  తో దాడి చేశారు. దాడి లో తీవ్రంగా గాయపడిన లోకేశ్వర్ రెడ్డి ని నంద్యాల ప్రవేట్ ఆసుపత్రి కి తరలించ‌గా, ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. గ్రామంలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కి పట్టున్న నాయకున్ని అడ్డుతొలగించుకోవాలని హత్యాయత్నానికి పాల్పడ్డారు. 

Back to Top