ద‌ళితుల‌పై టీడీపీ నేత‌ల దాడులు

గుంటూరు: పోలింగ్‌ తేదీ దగ్గరపడుతున్న కొద్ది ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ నేతలు బరితెగిస్తున్నారు. వైయ‌స్ఆర్‌ సీపీకి చెందిన కార్యకర్తలపై దాడికి దిగుతున్నారు. సోమవారం రాత్రి వైయ‌స్ఆర్‌ సీపీ కార్యకర్త నల్లిబోయిన లోకేశ్‌పై టీడీపీకి చెందిన నాయకులు దాడి చేశారు. వైయ‌స్ఆర్‌  కాంగ్రెస్‌ పార్టీ తరఫున ప్రచారం చేస్తున్నావు అంటూ కురగల్లు గ్రామానికి చెందిన టీడీపీ నేతలు ఈ దాడికి పాల్పడ్డారు. టీడీపీ నేతల రౌడీయిజంపై బాధితుడు నల్లిబోయిన లోకేశ్‌ మంగళగిరి పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. 

Back to Top