టీడీపీ నేత బొమ్మ‌రెడ్డి రాఘ‌వేంద్ర రెడ్డి వైయ‌స్ఆర్‌సీపీలో చేరిక‌

సీఎం వైయ‌స్ జ‌గ‌న్ స‌మ‌క్షంలో చేరిక‌

తాడేప‌ల్లి:  నెల్లూరు జిల్లాలో తెలుగు దేశం పార్టీకి భారీ షాక్ త‌గిలింది. ఆ పార్టీ సీనియ‌ర్ నాయ‌కుడు నెల్లూరు మాజీ జెడ్పీ ఛైర్మన్,  బొమ్మిరెడ్డి రాఘవేంద్ర రెడ్డి వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. తాడేప‌ల్లిలోని ముఖ్య‌మంత్రి  క్యాంప్‌ కార్యాలయంలో సీఎం వైయ‌స్  జగన్‌ సమక్షంలో రాఘ‌వేంద్రారెడ్డి  వైయ‌స్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. బొమ్మిరెడ్డితో పాటు నెల్లూరు జిల్లా ఆత్మకూరు మాజీ మార్కెట్‌ యార్డ్‌ చైర్మన్, టీడీపీ నేత ఇందూరు వెంకటరమణా రెడ్డి త‌దిత‌రులు వైయ‌స్ఆర్‌సీపీలో చేరారు. వీరికి పార్టీ అధ్య‌క్షులు, సీఎం వైయ‌స్ జ‌గ‌న్ కండువాలు క‌ప్పి పార్టీలోకి సాద‌రంగా ఆహ్వానించారు. కార్య‌క్ర‌మంలో ఎమ్మెల్యేలు మేకపాటి విక్రమ్‌ రెడ్డి, వరప్రసాద్,  వెంకటగిరి సమన్వయకర్త నేదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డి త‌దిత‌రులు పాల్గొన్నారు.

Back to Top