కాకినాడ: ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరికలు కొనసాగుతున్నాయి. అన్ని విపక్ష పార్టీల నుంచి నాయకులు, కార్యకర్తలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్నారు. టీడీపీ, జనసేన పార్టీల నుంచి వెల్లువలా వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడ రూరల్ నియోజకవర్గానికి చెందిన పలువురు టీడీపీ, జనసేన పార్టీ నాయకులు మంగళవారం వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాకినాడ రూరల్ ఎంపీపీ పుల్ల సుధ చందు, టీడీపీ గ్రామకమిటీ అధ్యక్షులు ముద్దన సూర్యప్రకాష్, జనసేన గ్రామకమిటీ అధ్యక్షులు పుల్ల రాము, తెలుగు యువత అధ్యక్షులు, మాజీ ఎంపీటీసీ శీలం చిన్న, మాజీ సర్పంచ్ బొండాడ విజయతో పాటుగా పెద్ద సంఖ్యలో కార్యకర్తలు వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు సమక్షంలో వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాకినాడ రూరల్ తమ్మవరం టీడీపీ నేతలు కాదా వల్లభరాముడు, కాదా శ్రీనివాస్, సిద్ధి నండిబాబు, పోలవరం రెడ్డి, 50 మంది కార్యకర్తలు.. నేమాం గ్రామ జనసేన, టీడీపీ నేతలు వనమాడి నాగేశ్వరరావు, రేవు వీరబాబు, దెయ్యాల ఏసుబాబు, కొప్పిశెట్టి వెంకటరమణ తదితరులు, 150 మంది కార్యకర్తలు మంత్రి కన్నబాబు సమక్షంలో వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు. పెద్దాపురం నియోజకవర్గంలోని సామర్లకోట టీడీపీ పార్టీకి చెందిన కౌన్సిలర్లు రెడ్నం దొరబాబు, కోడెల అర్జునరావు, పెండ్యం అబ్బు, తుతిక కామేశ్వరరావ, నమ్మి శ్రీనివాసు, జనసేన నుంచి కృష్ణ వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత దవులూరి సుబ్బారావు పార్టీ కండువా కప్పి వీరిని సాదరంగా ఆహ్వానించారు. కాగా, విశాఖలో జనసేన పార్టీకి చెందిన పలువురు సీనియర్ నాయకులు ఈరోజు వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు