సాధికార స్ఫూర్తితో వైయ‌స్ఆర్‌సీపీలో చేరికలు 

విజ‌య‌వాడ‌: ముఖ్యమంత్రి వైయ‌స్ జగన్ మోహన్ రెడ్డి  అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సామాజిక సాధికార యాత్రకు అనూహ్యస్పందన లభిస్తుంది. సాధికార స్ఫూర్తితో వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరిక‌లు ఊపందుకున్నాయి. ప్ర‌భుత్వవిప్ సామినేని ఉదయభాను ఆధ్వ‌ర్యంలో  జగ్గయ్యపేట పట్టణంలో జరిగిన సామాజిక సాధికార యాత్ర సన్నాహక సమావేశంలో ప‌లువురు పార్టీలో చేరారు. జగ్గయ్యపేట మండలం చిల్లకల్లు బీసీ కాలనీకి చెందిన మాజీ ఉపసర్పంచ్ కుమారుడు టిడిపి నాయకులు బత్తుల ఏడుకొండలు, జగ్గయ్యపేట పట్టణం రంగు బజారుకు ముస్లిం మైనార్టీ సోదరుడు షేక్ మూసా ప్రతిపక్ష టీడీపీని వీడి అధికార వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వవిప్, శాసనసభ్యులు సామినేని ఉదయభాను, ఆయ‌న తనయులు సామినేని వెంకట కృష్ణ ప్రసాద్ బాబు ఇరువురికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి సాధారంగా ఆహ్వానించారు. 

జనసేన పార్టీకి షాక్.. 
కోడూరు మండలం సాలెంపాలెం గ్రామానికి చెందిన , సైకం అర్జునరావు, కొప్పనాతి వెంకటేశ్వరరావు  గత ఆరు నెలల కిందట వైయ‌స్ఆర్‌సీపీకి రాజీనామా చేసి జనసేన పార్టీలో చేరారు. ఆ పార్టీ అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ తీరున‌చ్చ‌క‌పోవ‌డంతో మ‌ళ్లీ సొంత గూటికి చేరారు.  స్థానిక శాసనసభ్యులు సింహాద్రి రమేష్ బాబు సమక్షంలో సైకం అర్జునరావు, కొప్పనాతి వెంకటేశ్వరరావు వైయ‌స్ఆర్‌సీపీలో చేరారు. దీంతో జనసేన పార్టీకి తీరని దెబ్బ త‌గిలింది. మత్స్య‌కార కుటుంబానికి చెందిన సైకం అర్జున్ రావు గత సార్వత్రిక ఎన్నికల్లో వైయ‌స్ఆర్‌ సీపీ గెలుపున‌కు కృషి చేశారు. తిరిగి పార్టీలోకి రావ‌డంతో గ్రామంలో బ‌లోపేత‌మైంది. కార్యక్రమంలో జెడ్పీటీసీ సభ్యులు యాదవరెడ్డి వెంకట సత్యనారాయణ, మాజీ కెడిసిసి భ్యాంక్ డైరెక్టర్ ముద్దినేని చంద్రరావు, ఎంపిటిసిలు, బడే గంగాధర్ రావు, తిమ్మన నాంచారయ్య,ఉపసర్పంచ్ ఇంకొల్లుమురళి, మండల ఎస్సీ సెల్ నాయకులు వెన్నా ప్రసాద్,వైసీపీ నాయకులు కోట పద్మావతి వరప్రసాద్, విశ్వనాథుని సత్యనారాయణ పాల్గొన్నారు.

Back to Top