తిరువూరు మాజీ ఎమ్మెల్యే వైయ‌స్ఆర్‌సీపీలో చేరిక‌

తాడేప‌ల్లి:  ఎన్టీఆర్ జిల్లాలో తెలుగు దేశం పార్టీకి వ‌రుస‌గా షాకులు త‌గుతున్నాయి.  తాడేప‌ల్లిలోని ముఖ్య‌మంత్రి క్యాంప్‌ కార్యాలయంలో సీఎం వైయ‌స్ జగన్‌ సమక్షంలో ఎన్టీఆర్‌ జిల్లా తిరువూరు టీడీపీ మాజీ ఎమ్మెల్యే నల్లగట్ల స్వామిదాస్, ఆయన సతీమణి సుధారాణి వైయ‌స్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. 1994, 1999 లో రెండు సార్లు తిరువూరు నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యేగా స్వామిదాస్ గెలుపొందారు.  కార్యక్రమంలో రీజ‌న‌ల్ కో-ఆర్డినేట‌ర్లు ఎంపీ ఆళ్ళ అయోధ్య రామిరెడ్డి, ఎమ్మెల్సీలు మర్రి రాజశేఖర్, మొండితోక అరుణ్‌కుమార్, ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాసరావు పాల్గొన్నారు.

Back to Top