వైయ‌స్ఆర్‌సీపీలోకి వ‌ల‌స‌ల వెల్లువ‌

బ‌ద్వేల్‌లో వంద కుటుంబాలు వైయ‌స్ఆర్‌సీపీలో చేరిక‌

మ‌రో 50 మైనారిటీ కుటుంబాలు కూడా..

వైయ‌స్ఆర్ జిల్లా:  బ‌ద్వేల్ ఉప ఎన్నిక నేప‌థ్యంలో వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వ‌ల‌స‌లు కొన‌సాగుతున్నాయి. బుధ‌వారం బ‌ద్వేల్‌కు చెందిన వంద కుటుంబాలు వైయ‌స్ఆర్‌సీపీ తీర్థం పుచ్చుకున్నాయి. బద్వేలు మున్సిపాలిటీ పరిధిలో నాల్గవ వార్డు మడకలవారిపల్లి కౌన్సిలర్ రామచంద్రారెడ్డి, రామిరెడ్డి, నరసింహరెడ్డి శంకర్ రెడ్డి, సుబ్బారెడ్డి, గంగిరెడ్డితో  100 కుటుంబాలు  వై.యస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ నెల్లూరు జిల్లా అధ్యక్షులు, సర్వేపల్లి శాసనసభ్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి సమక్షంలో వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీలో చేరాయి. 

50 మైనారిటీ కుటుంబాలు కూడా..
బద్వేలు మున్సిపాలిటీ పరిధిలో జబిల్లా, అలీం భాషా,మాజీ కౌన్సిలర్ హుసేన్ భాషా, ఖాదర్ భాషలతో పాటు 50 ముస్లిం మైనారిటీ కుటుంబాలు వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ నెల్లూరు జిల్లా అధ్యక్షులు, సర్వేపల్లి శాసనసభ్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి  సమక్షంలో వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీలోకి చేరాయి. కార్య‌క్ర‌మంలో బద్వేలు మున్సిపల్ చైర్మన్ రాజగోపాల్ రెడ్డి, నాయ‌కులు పాల్గొన్నారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top