దిశకు న్యాయం జరిగింది

స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత

విజయవాడ: దిశను అత్యాచారం చేసి హత్య చేసిన ఉదంతం యావత్‌ దేశాన్ని కలచివేసిందని రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత అన్నారు. పోలీసులు తీసుకున్న నిర్ణయం హర్షించదగినదన్నారు. నలుగురి నిందితుల ఎన్‌కౌంటర్‌తో దిశకు న్యాయం జరిగిందని మంత్రి వనిత అన్నారు. ఈ రోజున నిజమైన దీపావళి అన్నారు. తెలంగాణ ప్రజలు ఏదైతే కోరుకున్నారో అదే జరిగిందన్నారు. దిశను హత్య చేసిన నిందితులకు లాయర్స్‌ కూడా సపోర్టు చేయలేదన్నారు. వారి తల్లిదండ్రులకు దిశను తిరిగి తెచ్చి ఇవ్వలేకపోయినా ఎన్‌కౌంటర్‌తో న్యాయం జరిగిందన్నారు. 

Read Also: రాజ్యాంగ ప్రదాతకు సీఎం వైయస్‌ జగన్‌ నివాళి

తాజా ఫోటోలు

Back to Top