గుంటూరు: టీడీపీ నేత డొక్కా మాణిక్య వరప్రసాద్ చరిత్రహీనుడిగా మిగిలిపోతారని తాడికొండ నియోజకవర్గ వైయస్ఆర్‌సీపీ సమన్వయకర్త వనమా బాల వజ్రబాబు వార్నింగ్ హెచ్చరించారు. వైయస్ఆర్‌సీపీ స్టేట్ కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డిపై డొక్కా చేసిన వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు వజ్రబాబు సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడే నైతిక హక్కు మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ కు ఏమాత్రం లేదన్నారు. ఆయన ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలో చేరిపోతారని, విలువలు లేని వ్యక్తి అంటూ ధ్వజమెత్తారు. రాజధాని అంశంపై వైయస్ఆర్‌సీపీ స్టాండు ఎప్పుడు ఒక్కటే అన్నారు. అమరావతి రాజధాని నుండి పరిపాలన కొనసాగుతుందని గతంలోనే మా అధినేత వైయస్ జగన్ చెప్పారని గుర్తు చేశారు. మా పార్టీ నాయకుడు సజ్జల రామకృష్ణారెడ్డి గురించి మాట్లాడే నైతిక హక్కు డొక్కా కు లేదన్నారు. డొక్కా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉంటూ తెలుగుదేశం నేతలకు టచ్ లో ఉండేవారని, ఆయనపై మా పార్టీ క్రమశిక్షణ చర్యలు తీసుకుంటుందని గ్రహించి తనకు ఏ పదవి ఇవ్వకపోయినా టీడీపీలో చేరిపోయారని విమర్శించారు. డొక్కా మాణిక్య వరప్రసాద్ నీచ రాజకీయాలను ప్రజలు గ్రహించి ఆయన్ను ఛీదరించుకుంటున్నారని తెలిపారు. శేష జీవితంలో వైయస్ఆర్‌సీపీని విమర్శిస్తూ గడపడమే డొక్కా పరమావధిగా పెట్టుకున్నారని వజ్రబాబు ఫైర్ అయ్యారు.