ఆళ్లగడ్డ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళలు ధైర్యవంతులు అనేలా సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి శక్తినిచ్చారని ఎంపీటీసీ సభ్యురాలు స్వాతి అన్నారు. యర్రగుంట్లలో సీఎం వైయస్ జగన్ నిర్వహించిన ముఖాముఖిలో స్వాతి మాట్లాడారు. నేనొక ప్రైవేట్ స్కూల్ టీచర్‌ని. మిమ్మల్ని మీరు మహిళలకు అందించే ధైర్యాన్ని చూసి నేను రాజకీయాల్లోకి వచ్చాను. నేను ఇప్పుడు ఎంపీటీసీగా పనిచేస్తున్నాను. దేశం మొత్తంలోనే యంగ్ అండ్ డైనమిక్ సీఎం మీరు. మిమ్మల్ని జగనన్నా అనకుండా గౌరవపూర్వకంగా సర్ అని పిలుస్తాను. అన్నా అంటే బంధం మాత్రమే అవుతుంది. మీకు ఎంత గౌరవం ఇచ్చినా తక్కువే. విమెన్ ఎంపవర్మెంట్‌తో మాకు ఎంతో శక్తిని ఇచ్చారు మీరు. ఎక్కడో ఉన్న మమ్మల్ని సమాజంలో మీ సమస్యలను పరిష్కరించుకుని సాధికారతను సాధించుకోమని 50% రిజర్వేషన్ కల్పించారు, ఏపీలో మహిళలు ధైర్యవంతులు అనిపించేలా చేసారు. మాకేం జగన్న ఉన్నారు....పిల్లలను చదివిస్తారు, బ్యాంక్ లోన్స్ సహా ఏది కావాలన్నా మీ ఆధ్వర్యంలో మాకు అందుతున్నాయి. రాష్ట్రంలో పేదరికం అనే మాట డిక్షనరీ నుండి నెమ్మదిగా తగ్గిపోతోంది. లంచం అనేమాట విని ఐదేళ్లు అవుతోంది. ఇది వాస్తవం. ఇక్కడ మీతో మాట్లాడే అవకాశం ఇవ్వకపోతే నేరుగా మీకు లేఖే రాసేదాన్ని. ఈ ప్రభుత్వంలో మాకు ఎంతో నచ్చింది స్వయంపరిపాలనే. ఒక్క సర్టిఫికెట్ కావాలంటే రోజులు, నెలలు పట్టేది. ఇప్పుడు సచివాలయాల వల్ల ఒక్కరోజులో సర్టిఫికెట్ వస్తోంది. మా సొంతింటి కలను నెరవేర్చిన సీఎం జగనన్న: అపర్ణ, మహిళా లబ్దిదారు అందరికీ నమస్కారం. నా భర్త సావిత్రి ప్రసాద్ ఒక ఆర్టిస్ట్. ఆయన శిల్పకళా మందిరంలో పనిచేస్తున్నాడు. మాకు ఒక చంటిబిడ్డ ఉంది. వికలాంగులమైన మా ఇద్దరికీ జగనన్న పాలనలో అన్ని ప్రభుత్వ పథకాలు అందాయి. పెన్షన్ అందించడంతో పాటు మా సొంతింటి కలను కూడా నెరవేర్చారు. జగనన్న అంటే నాకు పిచ్చి: సావిత్రి ప్రసాద్ జగనన్న అంటే నాకు పిచ్చి. నేను ఒక వికలాంగుడ్ని. నా భార్య నేను మొన్ననే టెట్ కూడా క్వాలిఫై అయ్యాము. వికలాంగులమైన నాకు, నాభార్యకు కలిపి రూ.6 వేలు పెన్షన్ ఇస్తున్నారు. ఈ ఐదేళ్లలో మాకు రూ.3.50 లక్షలు అందాయి. రాత్రంతా మేల్కొని మీ బొమ్మ గీశాను. నా మీద ప్రేమతో దానిని స్వీకరించాలని కోరుతున్నాను. నా బిడ్డ ప్రాణం నిలబెట్టిన జగనన్న: హుస్సేన్ భాషా, లబ్దిదారుడు నేను ఒక ప్రైవేట్ ఉద్యోగిని. నా కుమారుడు అనారోగ్యపాలైతే దగ్గరలోని ఆస్పత్రికి తీసుకెళ్లాను. డాక్టర్లు చాలా పెద్ద సమస్య అని చెప్పారు. నేను ఏమాత్రం క్రుంగిపోలేదు. జగనన్న ఉన్నాడనే ధైర్యంతో ఆరోగ్యశ్రీ కార్డు తీసుకుని తిరుపతి ఆస్పత్రికి వెళ్లాను. రూ.5 లక్షల విలువైన 3 సర్జరీలలో ఇప్పటికే 2 సర్జరీలు చేశారు. మంచానికే పరిమితమైన నా కొడుకు ఇవాళ లేచి నిలబడుతున్నాడు. ఇప్పుడు మీరు ప్రవేశపెట్టిన రూ.25 లక్షల ఆరోగ్యశ్రీ పరిమితితో 3 సర్జరీ కూడా జరగబోతోంది. నా బిడ్డ ప్రాణం నిలబెట్టిన వ్యక్తి జగనన్న. పైన ఉన్న యముడికి క్రింద ఉన్న ప్రజలకు అడ్డుగా నిలబడే సీఎం మీరు.