చంద్రబాబు పాలనలో హిందూ ధర్మం నాశనం

వైయస్‌ జగన్‌ కలిసిన ఏపీ సాధు పరిషత్‌ స్వామీజీలు

వైయస్‌ఆర్‌సీపీకి స్వామీజీలు సంపూర్ణ మద్దతు

 

హైదరాబాద్‌:వైయస్‌ఆర్‌సీపీ ప్రధాన కార్యాలయంలో వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని ఏపీ సాధుపరిషత్‌ స్వామీలు కలిశారు.ఎన్నికల్లో వైయస్‌ జగన్‌ సంపూర్ణ మెజార్టీతో గెలిచి సీఎం కావాలని ఆశీర్వాచనాలు ఇచ్చారు.టీడీపీ ప్రభుత్వం హిందూ ధర్మానికి,దేవాలయ వ్యవస్థలు,ధార్మిక సంఘాలను అణివేస్తుందన్నారు.ప్రశ్నించిన స్వామిజీలపైనే కేసులు పెట్టారని శ్రీనివాసానంద సరస్వతి  అన్నారు.వైయస్‌ జగన్‌ పాలనలో అన్ని మతాలు సుఖంగా ఉంటాయని,హిందూమతం పరిఢవిల్లుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

చంద్రబాబు తన స్వార్థ ప్రయోజనాల కోసం దేవాలయాల భూములను అప్పనంగా దోచిపెట్టడం జరిగిందని మండిపడ్డారు.దేవాలయాలు,ధార్మిక సంస్థల ఆస్తులను లూటీచేశారన్నారు.అధికారంలోకి వచ్చిన తర్వాత  కమిషన్‌ వేస్తామని వైయస్‌ జగన్‌ హామీ ఇచ్చారని తెలిపారు.ప్రజలందరూ వైయస్‌ఆర్‌సీపీకి మద్దతు ఇవ్వాలని కోరారు.

 

Back to Top