కృష్ణా జిల్లా: రాష్ట్రంలో ప్రజలందరి బాగు కోరుకుంటున్న ఏకైక సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి అని హోంమంత్రి మేకతోటి సుచరిత పేర్కొన్నారు. కృష్ణా జిల్లాలో అంబేద్కర్, బాబు జగ్జీవన్‌రామ్ విగ్రహాలను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..సంక్షేమ పథకాల ద్వారా లబ్ధిపొందే వారికి నేరుగా వారి ఖాతాల్లోనే సీఎం వైయస్ జగన్ ఒక బటన్ నొక్కి నగదు జమ చేస్తున్నారని చెప్పారు. సీఎం చేపట్టిన పథకాల వలన ఎస్సీ, ఎస్టీల ఆర్థిక స్థితిగతులు మారుతున్నాయన్నారు. పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీ అనే మహత్తర కార్యక్రమాన్ని సీఎం తలపెట్టారు. పేదల సొంతింటి కలను సీఎం వైయస్ జగన్ నెరవేరుస్తున్నారు. డిసెంబర్ 25న దాదాపు 30 లక్షలకు పైగా అర్హులకు ఇళ్ల స్థలాలు పంపిణీ జరుగుతోందని చెప్పారు. బడుగు, బలహీన వర్గాల భవితకు అంబేద్కర్, జగ్జీవన్‌రామ్‌లు ఆనాడే పునాదులు వేశారని తెలిపారు. నేడు మా లాంటి వారు పదవులు అనుభవిస్తున్నారంటే, దానికి ఆ మహనుభావుల భిక్షే కారణం. అంబేద్కర్ ఆశయాల గురించి ప్రతి ఒక్కరూ మాట్లాడుతుంటారు.. కానీ చేతల్లో చూపించే వారుండరు. ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి అంబేద్కర్ ఆశయాలను నెరవేరుస్తున్నారని పేర్కొన్నారు. ఎస్సీ,ఎస్టీ,బీసీ, మైనారిటీల అభివృద్ధి కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలను ప్రవేశపెట్టారని తెలిపారు. అంబేద్కర్, బాబు జగ్జీవన్ రామ్ విగ్రహాల ఏర్పాటుకు సహకరించిన స్థానిక ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్‌కు మంత్రి సుచరిత ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.